కొబ్బరి కాయల నెయ్యే నీకు హరి హరి తనయుడ అయ్యాప్పా
ఇరుముడి నెత్తుకు వచ్చామయ్యా హరి హరి తనయుడ అయ్యాప్పా !2!
రావా రావా రావయ్యే సన్నిధికి రావయ్యా
రావా రావా రావయ్యే పడిపూజ నీదయ్య !కొబ్బరి!
ముత్యాల రతనాల ముగ్గులే వేసేము
అందాల అయ్యాప్పా పడిపూజ చేసేము
రావా రావా రావయ్యే సన్నిధికి రావయ్యా
రావా రావా రావయ్యే పడిపూజ నీదయ్య !కొ!
ఇరుముడులు కట్టుకొని ఎరుమేలి చేరేము
పంచవర్ణ రంగులతో పేటతుళ్ళి ఆడేము
రావా రావా రావయ్యే సన్నిధికి రావయ్యా
రావా రావా రావయ్యే పడిపూజ నీదయ్య !కొ!
ఆలైకట్ట అలుదానది ఆటలాడు స్వాములు
కరిమల కష్టాలు సరిచూసే స్వాములు
రావా రావా రావయ్యే సన్నిధికి రావయ్యా
రావా రావా రావయ్యే పడిపూజ నీదయ్య !కొ!
పడునెనిమిది మెట్లపైన హరిహర తనయుడు
అభిషేక పూజలతో అలరారు తున్నారు
రావా రావా రావయ్యే సన్నిధికి రావయ్యా
రావా రావా రావయ్యే పడిపూజ నీదయ్య !కొ!
కొబ్బరి కాయల నెయ్యే నీకు హరి హరి తనయుడ అయ్యాప్పా హరి హరి తనయుడ అయ్యాప్పా !5!
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.