తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం
మనసారా ఇచ్చేమమ్మా దేవీ నీ కోసం
కామాక్షీ అంటూ కొలిచే కాంచీపుర నగరం
మీనాక్షీ నిన్నే పిలిచే మధురాపురి నగరం
అష్టాదశ పీఠాలను నీవు అధిష్ఠించి నావా.......
అర్ధశరీరము గైకొని నీవు శాంకరివైనావా.......
॥ అమ్మా॥
దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం
భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల క్షేత్రం
శబరీమలపై మాలికపురవై వెలసిన మాతల్లీ
శంకరదేవుని జటాజూటమున విరిసిన సిరిమల్లీ
॥ అమ్మా॥