మాల వేసుకుంటే కాదు కన్నె స్వామి
నీ మనసు శుద్ధి చేసుకో కన్నె స్వామి
మాలంటే మాలయ మహిమలున్నమాలయ
శ్రీశైల వాసుని శివశక్తి మాలయ
శరణు మల్లన్న స్వామి శరణు మల్లన్నా
శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్నా
రుద్రయ్య మెడలోన రుద్రాక్ష మాలయా
పార్వతమ్మ మెడలోన పథకాల మాలయా
గురుస్వామి మెడలోన అలరించు మాలయ
శ్రీశైల వాసుని శివశక్తి మాలయ
శరణు మల్లన్న స్వామి శరణు మల్లన్నా
శరణు మల్లన్న స్వామి శరణము మల్లన్నా
ముత్యాల కాంతులతో వెలిగేటి మాలయా
రతనాల కాంతులతో మెరిసేటి మాలయా
పాతాళ గంగలోన మునిగేటిమాలయ
శ్రీశైల వాసుని శివశక్తి మాలయ
శరణు మల్లన్న స్వామి శరణు మల్లన్నా
శరణు మల్లన్న స్వామి శరణు మల్లన్నా
కామ క్రోధములు త్రుంచు కాలకంఠుని మాలయా
బావ బంధములను దాటు బంగారు మాలయా
మనసు స్థిరము చేసేటి మహిమలున్న మాలయా
శ్రీశైల వాసుని శివశక్తి మాలయా
శరణు మల్లన్న స్వామి శరణు మల్లన్నా
శరణు మల్లన్న స్వామి శరణు మల్లన్నా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.