ఆది గణాదిపతే ఆనంద మూర్తి.. ఆది గణాదిపతే ఆనంద మూర్తి
అమ్మచేసిన నలుగు పిండితో అవతరించినా గజముఖ వదనా...
// ఆది గణాదిపతే//
మారేడు నేరేడు కాయలు,చెంగల్ వాపు మెంత పువ్వులు, మామిడాకులు, మంచి గంధమూ గరిక తోటి గణమైన పూజలూ ముప్పది రెండు పత్తులచేత ముందుగనిన్ను మ్రొక్కెదమయ్యా...
// ఆది గణాదిపతే//
పులిహోరా పొంగళ్ళు పాయసం, వడపప్పు, గుండ్రాళ్ళు బెల్లము, పూలు పండ్లు, కొబ్బరి కాయలు, ఆవు పాలు నీకు నైవేద్యాలు
ఎలుక వాహనం ఎక్కిన దేవా వేగమె రావా మమ్ముబ్రోవా...
// ఆది గణాదిపతే//
గణా నాయకా రావా గౌరీ తనయా.. గజ్జలందులో ఘల్లు ఘల్లున మ్రోగా
వెండి కొండ పైన ఉండే ఏకదంతుడా... ఎల్లలోకాలనేలే లంబోదరుడా.....
సిద్దివి నీవే బుద్దివి నీవే సిద్ది వినాయకా.. సిద్దివి నీవే బుద్దివి నీవే సిద్ది వినాయకా..
విగ్నేశ్వరుడు అందువు నీవే ఈశ్వర తనయా.....
// ఆది గణాదిపతే//
ఆది గణాదిపతే ఆనంద మూర్తి.. ఆది గణాదిపతే ఆనంద మూర్తి
అమ్మచేసిన నలుగు పిండితో అవతరించినా గజముఖ వదనా.
దేవాదిదేవా గణపతి దేవా నీకంటే ఎవరెక్కువా.. స్వామి నీ నీకంటే ఎవరెక్కువా....
గణపతి బప్పా మోరియా
గణపతి బప్పా మోరియా
గణపతి బప్పా మోరియా
గణపతి బప్పా మోరియా