🏵️నల్లా నల్లాని వాడు నామాలు గలవాడు
నిలువెత్తు రూపాన చిరునవ్వు గలవాడు
ఆ ఏడు కొండల్లోన కొలువై ఉన్నవాడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల
🙏 అలిపిరి కొండ కాడ అభయాన్నే ఇచ్చువాడు
అడుగు దండాలవాడు శ్రీవేంకటేశుడు
శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల
🙏 శేషాద్రి కొండల్లోన పవళించి ఉన్నవాడు
వడ్డీ కాసుల వాడు వడ్డీ పట్టి లాగేటోడు
మోకాళ్ళ కొండ కాడ మోక్షాన్నే ఇచ్చువాడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల
🙏 అంతెత్తు కొండల్లోన అగుపడని తావుల్లోనా
కొండల్లో ఉన్నవాడు కోనేటి రాయుడు
శ్రీ లక్ష్మీ నాథుడు సిరిగల్ల దేవుడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల
🏵️నల్లా నల్లాని వాడు నామాలు గలవాడు
నిలువెత్తు రూపాన చిరునవ్వు గలవాడు
ఆ ఏడు కొండల్లోన కొలువై ఉన్నవాడు
హరి హరి గోవింద హరి హరి గోవింద
హరి హరి గోవింద గోవిందా
గోవింద గోవింద గోపాల