శ్రీరాముని గురుతుగా ఆంజనేయ సాక్షిగా !2! వెలిసాడు రామయ్య సీతమ్మ తోడుగా !3! జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ!2! ఆయోద్యపురిలోన కౌశల్య గర్భాన !2! జన్మించినావయ్య రఘువంశ రామయ్య !2! నిను కొలిచే భక్తులకు ఇలావెల్పే నీవయ్య భక్తితో పిలిచామయ్యా వేగమే నువు రావయ్యా జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ!2! భద్రాద్రి శిఖరాన గోదావరి తీరాన !2! సీతమ్మ తల్లితో కొలువై ఉన్నవయ్య !2! నీవే మా పాలిట కలియుగ దైవమని నిన్నే నమ్మితిమయ్యా భద్రాచల రామయ్య జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ!2! ఆ రామ నామమే మధురాతి మధురము శ్రీరామా నామమే భక్తులకు నిలయము ఆ రామ నామమే మధురాతి మధురము శ్రీరామా నామమే భక్తులకు నిలయము రామ రామా అంటూ పలుమార్లు పిలిచిన !2! దాయరాధ మాపైన కోదండ రామయ్య !! జైశ్రీమన్నారాయణ జైజైశ్రీమన్నారాయణ!2! జైజైశ్రీమన్నారాయణ, జైజైలక్ష్మినారాయణ
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.