పల్లవి
శరణు శరణు శంకరా కరుణ చూపరా
కరుణ చూపి మమ్ము నీవు కనికరించరా
" శరణు శరణు శంకరా కరుణ చూపరా "
చరణం 1
విశ్వేశ్వరా దేవా దీన బాంధవా
విఠలాక్ష రావయా నిన్నే మది నమ్మితీ "2"
నిన్నేమది నమ్మితీ నాపాలి దైవమనీ"2"
నను బ్రోవ గతి నీవే నీలకంధరా
"శరణు శరణు శంకరా కరుణ చూపరా"
చరణం 2
పరమ పావనా దేవా పాప నాశనా
పరమాత్మ నీ పాద శరణు సేవ చేసితి"2"
చంద్రశేఖరా దేవా మమ్ము కావరా "2"
మమ్ము కావరా దేవా మల్లిఖార్జునా
"శరణు శరణు శంకరా కరుణ చూపరా"
చరణం3
ఈశా మహేశా పాహి పాహి పాహిమాం
కాశి నివాస కావ రావయ్యా"2"
వారణా శీశ్వరా వరము లివ్వరా"2"
వరము లివ్వరా దేవా అభయ శంకరా
"శరణు శరణు శంకరా కరుణ చూపరా "
తోడి రాగం ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.