ఊయ్యాల ఊయ్యాలో ఊయ్యాల శ్రీశైల మల్లన్నకే ఊయ్యాల--2
ఊయ్యాల ఊయ్యాలో ఉమామహేశ్వరునికే ఊయ్యాలో--2
ఘన ఘన గంటాలు
ధన ధన దరువులు గంగా జలములు లింగాభిషేకాలు --2
భక్తుల సేవాలంటా ఉయ్యాలో భ్రమరాంభ లోలు నికే ఉయ్యాలో -----( ఉయ్యాలో)
సన్నాయి మేళాలు సద్ధంగ దరువులు ముక్కోటి శివునికి నిండొక్క పొద్దులు -2
మల్లెపు దండలటా ఉయ్యాలో
మల్లన్న దేవునికే ఉయ్యాలో----- (ఉయ్యాలో)
విభూది రేకాలు మారేడు ఆకులు మండల దీక్షలు జ్యోతిరుముడులు జాగారాలంటా ఉయ్యాలో జగమేలు శంకరునికే ఉయ్యాలో (ఉయ్యాలో)
పచ్చని పందిర్లు మామిడి తోర్నాలు మల్లన స్వామికి కళ్యాణ ఘడియాలు -2
గంగమ్మ దేవునికే ఉయ్యాలో లింగ స్వరుపునికే ఉయ్యలో (ఉయ్యాలో)
ఇంటింట ముగ్గులు ఇంతైన సేవలు ముత్యాలు రత్నాలు తోలి పంట తలువాలు -2
దగ దగ కాంతులటా ఉయ్యాలో దండి గంగాదరునికే ఉయ్యాలో ఓంకారా నాదాలట ఉయ్యాలో లోకాల శంకరునికీ ఉయ్యాలో --2
(ఉయ్యాలో)