#Ayyappa swamy pampa arattu - పాలమూరు లో అయ్యప్ప స్వామి వారి చక్రోత్సవము - పంపా అరట్టు - జై శబరీష భక్త బృందం

P Madhav Kumar
1 minute read

  మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు పట్టణంలోని కొత్తగంజ్ లో గల శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో - జై శబరీష భక్త బృందం - శ్రీ శ్రీ జనార్ధన్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పంబ ఆరట్టు (చక్రోత్సవము) అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

ఉదయం 7 గంటల నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. సేవా కార్యక్రమాల్లో పలువురు సభ్యులు భగవంతుని సేవలో తరించారు.

ఉదయం 10 గంటలకు గణపతి పూజా - పుణ్యహవచనం తో కార్యక్రమం మొదలయ్యింది.

తరువాత 10:30 నిమిషాలకు శ్రీ అయ్యప్ప స్వామి వారి చక్రోత్సవము (పంపా అరట్టు), 11 గంటలకు అయ్యప్ప స్వామి వారి పడి పూజ ప్రారంభమైయింది.

మధ్యహ్నం పడి వందనం తరువాత అన్నదానం నిర్వహించారు. 

ఉదయం నుంచి కొనసాగిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది స్వాములు, సేవకులు, భక్తులు తమ తమ సేవలను వస్తు రూపేణ, ధన రూపేణ, సేవా రూపేణ, మరికొందరు గాయకులు తమ గానంతో సేవలను అందించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షులు శ్రీ పోల శ్రీనివాసులు గారు, ఆలయ కమిటీ సభ్యులు, జై శబరీష భక్త బృందం సభ్యులందరూ,  గాయకుడు కార్తీక్ చారి,  మొదలైన వారు పాల్గొనటం జరిగింది.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat