అయ్యా నియమాల మాలతో - నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా
మలినమైన నా మనసు నందు - యతి మధుర మొలికెనయ్యా
దివ్య జ్యోతి అను పేరులోన - ఇక చీకటి ఉండదయ్యా
రంగ నాధుడే వెలసిన గ్రామము - నిత్య వెలుగులయ్యా
శరణ ఘోషలే పాడుకొంటిని - క్షణము క్షణము నిన్ను మరువకుంటిని ||2||
గుండె నిండుగా నీదు రూపమే - నింపుకొంటినయ్యా
|| అయ్యా నియమాల||
మా ఊరిలో వున్న మా భాగ్యలక్ష్మికి - బాధ చెప్పు కున్నాపోచమ్మకు బోనము చేసి - మొక్కు మొక్కు కున్నా
అభయమిచ్చు ఆ ఆంజనేయునీతో నేను వేడుకున్న
మొక్కులన్నీ ఇరుముడిన కట్టి - నీ కొండ చేరుతున్నా
కరుణించి దారి చూపిస్తావో - కానల్లో మమ్ము నడిపిస్తావో||2||
కరుణామయా కానన వాసా - కనికరించవయ్యా !
||అయ్యా నియమాల॥
కటిక నేలపై తుంగచాపపై - నిద్రపోతినయ్యాకనులు ముసిన కలల నిండా - నీ దివ్యరూపమయ్యా
పడిపూజల నీదురూపమే - మనసు నిండెనయ్యా
పంచగిరులను వదిలివచ్చి - మా పక్కనుండవయ్యా
కన్నెస్వామి రూపములోనో - కత్తిస్వామి రూపములోనో||2||
గురుస్వామి రూపములోనో - మాముందు నిలుతువయ్యా
||అయ్యానియమాల||
కాలినడకతో కొండకోనలో - నడిచి వచ్చు వేలాప్రతి చెట్టు పుట్టలో - నీదునామమే ప్రతిద్విన్చెనయ్యా
పసిపాప రూపమున - పడి మెట్లపై నిన్ను చూసేవేళ
నా తనువులోని అణువణువునందు - నీరూపు నిండేనయ్యా
ఏ జన్మలోన నీ రుణముందో - ఈ జన్మలోన అది తీరిందో||2||
ప్రతి జన్మలోన నిను కొలిచే భాగ్యము - కనుకరించవయ్యా
||అయ్యానియమాలు||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
