99. Ammavaare kurchunte - అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే - అమ్మవారి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

99. Ammavaare kurchunte - అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

జై దుర్గా భవాని మాతకు - జై

అమ్మల గన్న అమ్మకు - జై అది పరాశక్తికి - జై జై జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి - జై
అమ్మవారే కూర్చుంటే అచ్ఛం దుర్గలాగే ఉంటుంది... కనకదుర్గ లాగే ఉంటుంది...
కోరస్ || 2 సార్లు
అందాలు చిందించు మందహాసము... కోరస్ || 2 సార్లు ఆ మోమునగుపించు చంద్రబింబము... కోరస్ || 2 సార్లు ఆ చంద్రుణ్ణి ధిక్కరించు నుదుట తిలకము... కోరస్ || 2 సార్లు ఆ తిలకమే కన్నులకు ఇహపర శుభము...
కోరస్||అమ్మవారే కూర్చుంటే||
జై దుర్గా భవాని మాతకు - జై ఏటేటా పండుగలు ఉత్సవాలు... కోరస్ || 2 సార్లు నీకు దండిగాను దీప ధూప నైవేద్యాలు... కోరస్ || 2 సార్లు నీ పండుగకు చేసారు గొప్ప విందులు... కోరస్ || 2 సార్లు ఆ విందారగిస్తుంది మన కనకదుర్గ...
కోరస్||అమ్మవారే కూర్చుంటే||
ఇంటింటా ఊరూరా వెలసింది తల్లి... కోరస్ || 2 సార్లు మన కంటి పాపల మన కల్పవల్లీ... కోరస్ || 2 సార్లు మన ఇంట ఉంటుంది మాధవుని చెల్లి... కోరస్ || 2 సార్లు మన ఇంతే ఉంటుంది మన చిట్టి తల్లీ...
కోరస్||అమ్మవారే కూర్చుంటే||
మావంటి దీనులను కాపాడవమ్మా... కోరస్ || 2 సార్లు నీ వెంటే నా మనసు నిలిచెను తల్లీ... కోరస్ || 2 సార్లు టియస్ పురం భక్తులను కాపాడవమ్మా... కోరస్ || 2 సార్లు అందరినీ కాపాడు కనకాదుర్గమ్మా...
కోరస్||అమ్మవారే కూర్చుంటే||
కనకదుర్గ లాగే ఉంటుంది... కోరస్ || 4 సార్లు

ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow