సంధ్య దీపారాధనలో
వచ్చును జ్యోతి రూపాన
వరాల తండ్రి అయ్యప్ప స్వామి
శరణం శరణం అయ్యప్ప (2)
కాళ్ళకు గజ్జెలు కట్టుకొని
పట్టు పంచెను చుట్టుకుని
కంఠాన మణిహారం వేసుకుని
కదిలిండు అమ్మ మణికంటుడే స్వామి
శరణం శరణం అయ్యప్ప (2)
శ్రీశైలం మల్లన్న కొడుకు అంట
తిరుమల వెంకన్న తనయుడుఅట
లాల పోసెను గౌరమ్మ
ఊయలలూపెను లక్ష్మమ్మ స్వామి
శరణం శరణం అయ్యప్ప (2)
విల్లు బాణం పట్టుకుని
పులి పైన బాలుడు వస్తుంటే
కొమ్మ మీద కోయిలమ్మ పాడేనట
పురి విప్పి నెమలమ్మ ఆడేనట స్వామి
శరణం శరణం అయ్యప్ప (2)
కమ్మని పాటలు పాడంగా
కన్నె స్వాముల అంతా ఆడంగా
కత్తి గద గంట స్వామి వేడంగ
గురు స్వామి దీవెనలు పొందoగా స్వామి
శరణం శరణం అయ్యప్ప (2)
సాయంకాల సమయంలో
సంధ్య దీపారాధనలో
వచ్చును జ్యోతి రూపాన
వరాల తండ్రి అయ్యప్ప స్వామి
శరణం శరణం అయ్యప్ప (2)
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
