పల్లవి:
శ్రీకర శుభకర రారా - ఓశివుని కుమార రారా - 2
శ్రీ గణ నాధా రారా - నీ శరణము కోరితి రారా - 2
గజముఖ వరదా రారా - ఓ గణపతి దేవా రారా - 2
మూషిక వాహన రారా - నినుముందుగ వేడెద రారా - 2
సురగణ పూజిత రారా - వరసిద్ధి వినాయక రారా - 2
గౌరీ తనయా రారా - విఘ్నాలను బాపగ రారా - 2
మల్లె మందార కలువ - జిల్లేడు గన్నేరు పూలు - 2
ముదముగ మాలలు కట్టి - నీ మెడలో వేసెద రారా - 2
కుడుములు ఉండ్రాళ్లు స్వామి - కడుపారగ సేవించుమురా - 2
కోరిన వరములనొసగి - ఓకరిముఖ త్వరగా రారా - 2
గణ గణ గంటలమోత - వినబడదా విఘ్న నివారా - 2
ఘనముగ భజనలు చేయ - అలుకేలర అరుదెంచుమురా - 2
