జయ జయ జయ జగదీశ్వరి
ప్రియ జననీ నీకు జయం
నిలకడగా నీ నామం స్మరియింతునె నే నిరతం
సాధించవె నాదువ్రతం !!జయ జయ!!
శరశ్చంద్ర లాంటి మోము చెరగని దరహసముతో
కన్నుల వెన్నెల గిన్నెల కరుణామృత ఝల్లులతో.
మురిపించే మాతాంగివి కాపాడవె కల్పవల్లి
శరణంటిని మా తల్లీ
||జయ జయ ||
కర కంకణ స్వరఝరిలో ఓంకారము ప్రభవించగవీణా పాణివి నీవై వేద గీతి పలికించగ
స్వరజతిలో ఈ జగతిని పాలించే సరస్వతీ
నెరవేడితి మాతల్లి
