శ్రీ గణేశ ప్రార్థనా శ్లోకాలు - Sri Ganesha Prarthana Slokaalu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ గణేశ ప్రార్థనా శ్లోకాలు - Sri Ganesha Prarthana Slokaalu

P Madhav Kumar

🕉 శుక్లాంబరధరం విష్ణుం — శాంతి ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే॥


🕉 అగజానన పద్మార్కం — గణపతి ధ్యానం

అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం
ఏకదంతముపాస్మహే॥


🕉 వక్రతుండ మహాకాయం — కార్యసిద్ధి ప్రార్థన

వక్రతుండ మహాకాయం
కోటిసూర్య సమప్రభం
అవిఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా॥


🕉 యం బ్రహ్మా వేదాంతవిదః — గణపతిని పరమాత్మగా వర్ణన

యం బ్రహ్మా వేదాంతవిదో వదంతి
పరం ప్రధానం పురుషం తదాన్యే
విశ్వోద్గతేః కారణమీశ్వరం వా
తస్మై నమో విఘ్న వినాశకాయ॥


🕉 మూషిక వాహన మోదక హస్త — గణపతివాహన స్తుతి

మూషిక వాహన మోదక హస్త
చామర కర్ణ విలంబిత సూత్ర
వామన రూప మహేశ్వర పుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే॥


🕉 గజాననం భూతగణాధి సేవితం — విఘ్నేశ్వర శరణాగతి

గజాననం భూతగణాధి సేవితం
కపిత్థ జంబూఫల సార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం॥


🕉 శ్వేతార్క మూల గణేశ ధ్యానమ్ — విశిష్ట గణపతి ధ్యానం

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ
దక్షప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ
కుమారగురవే సురాసుర వందితాయ

సర్వభూషణాయ శశాంక శేఖరాయ
సర్వమాలాలంకృత దేహాయ
ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ
త్రాహి త్రాహి దేహి దేహి

అవతర అవతర గంగం గణపతయే
వక్రతుండ గణపతయే సర్వపురుష వశంకర
సర్వదుష్ట మృగ వశంకర వశీకురు వశీకురు
సర్వదోషాన్ బంధయ బంధయ

సర్వ వ్యాధీన్ నికృంతయ నికృంతయ
సర్వవిషాణీ సంహార సంహర
సర్వ దారిద్ర్య మోచయ మోచయ
సర్వ శత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ

సర్వసిద్ధింకురు కురు
సర్వకార్యాణి సాధయ సాధయ
గాం గీం గౌం గైం గాం గః
హుం ఫట్ స్వాహా॥


🕉 శాంకరీ సుప్రజా దేవి — గణేశ ప్రభాత ప్రార్థనాష్టకం

శాంకరీ సుప్రజా దేవి
ప్రాతఃకాలః ప్రవర్తతే
ఉత్తిష్ఠ శ్రీ గణాధీశ
త్రైలోక్యం మంగళం కురు॥

ఉత్తిష్ఠ దేవ దేవేశ
ఉత్తిష్ఠ ద్విరదానన॥


🕉 ఉత్తిష్ఠ లోకరక్షార్థం — ఉత్థాన ప్రార్థన

ఉత్తిష్ఠ లోకరక్షార్థం
అస్మాకం రక్షణాయ చ॥


🕉 ఉత్తిష్ఠ వేదవేద్య స్త్వం — విద్యా వివేక ప్రార్థన

ఉత్తిష్ఠ వేదవేద్య స్త్వం
బ్రహ్మణాం బ్రాహ్మణస్పతే।
ఆవిద్యా గ్రంధి ముచ్ఛిద్య
విద్యాం విద్యోపయాత్మని॥


🕉 ఉత్తిష్ఠ భో దయాసింధో — జ్ఞానప్రదాత గణపతిని ప్రార్థన

ఉత్తిష్ఠ భో దయాసింధో
కవీనాం త్వం కవిః ప్రభో।
అస్మాకమాత్మవిద్యాం
త్వముపదేష్ఠుం గణాధిప॥


🕉 పూజా సంభార సంయుక్తా — పూజ ఆహ్వానం

పూజా సంభార సంయుక్తా
వర్తంతే ద్వారి పూజకాః।
ఉత్తిష్ఠ భక్తాన్ నుద్ధర్తుం
ద్వైమాతుర నమోస్తుతే॥


🕉 భో భో గణపతే — మేల్కొలుపు ప్రార్థన

భో భో గణపతే నాథ
భో భో గణపతే ప్రభో।
భో భో గణపతే దేవ
జాగృహ్య ఉత్తిష్ఠ మామవ॥


🕉 ప్రసీద ప్రసీద ప్రభో — కృపాప్రార్థన

ప్రసీద ప్రసీద ప్రభో విఘ్నరాజ!
ప్రణామి ప్రణామి ప్రభో తే వదాన్యే।
ప్రతీచ్ఛ ప్రతీచ్ఛ ప్రభో మత్కృతార్చాం!
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో కామితార్థం॥


🕉 నమస్తే నమస్తే ప్రభో — శుభాశయ నివేదన

నమస్తే నమస్తే ప్రభో శంభుసూనో!
నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో!
నమస్తే నమస్తే ప్రభో పాపహారిన్!
నమస్తే నమస్తే ప్రభో మోక్షకారిన్॥



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow