శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 04. అష్టాదశ శ్లోకీ గీతా - Sri Saraswati Vidya peetham
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 04. అష్టాదశ శ్లోకీ గీతా - Sri Saraswati Vidya peetham

P Madhav Kumar
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అష్టాదశాధ్యాయే గీతాసారే అష్టాదశ శ్లోక పారాయణం కరిష్యే

అర్జున ఉవాచ


1. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । 
న చ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥
(1-31)
భావము: ఓ కేశవా పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేద

శ్రీ భగవానువాచ


2. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ । 
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||
(2-48)
భావము: ఓ ధనంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ది - అసిద్దుల యెడ సమత్వభావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమే యోగమనబడును.


3. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ | 
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ||
(3-6)
భావము: బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూడుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు.

4. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః | 
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ||
(4-39)
భావము: జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాళువైన మనుజును ఈ భగవత్తత్త్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్త్వరూపమైన పరమశాంతిని పొందును.

5. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః । 
విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥
(5-28)
భావము : బాహ్య విషయ భోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనవలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును.

6. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు । 
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥
(6-17)
భావము: ఆహారవిహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్స్వప్నాదులయందును యథాయోగ్యముగ ప్రవర్తించు వానికి దుఃఖ నాశకమగు ధ్యానయోగము సిద్ధించును.

7. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | 
మామేవ యే ప్రపద్యంతే! మాయామేతాం తరంతి తే||

(7-14)

భావము : నా మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అతిక్రమించుటకు సాధ్యము కానిది. కాని కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను దాటి, సంసారసముద్రము నుండి బయటపడగలరు.

8. అగ్నిర్ణ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ | 
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ॥
(8-24)
భావము: బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గముద్వారా బ్రహ్మపద ప్రాప్తినందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులు క్రమముగా దిన (పగలు) శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతల ద్వారా కొనిపోబడి పరమపదమును చేరుదురు.

9. అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ । 
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ॥
(9-30)
భావము: మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో, అతని సత్పురుషుడుగానే భావింపదగును. ఏలనన యథార్ధముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరియెకు ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.


10. యోమామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ | 
అసమ్మూఢః స మర్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ॥
(10-3)
భావము: నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానినిగను, సకలలోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపముల నుండియు విముక్తుడగును.

11. మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్ణితః | 
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ ॥
(11-55)
భావము: అర్జునా, కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేని వాడును, ఏ ప్రాణియందును ఏ మాత్రము వైరభావములేనివాడును ఐన, అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు.

12. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే | 
ధ్యానాత్కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనన్తరమ్ ||
(12-12)
భావము: తత్త్వము నెఱుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్ష జ్ఞానముకంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానముకంటెను (శాస్త్రపాండిత్యము కంటెను) పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్ఠము. ధ్యానముకంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన, త్యాగమువలన వెంటనే పరమశాంతి లభించును.

13. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారతః 
క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ||
(13-2)
భావము: ఓ అర్జునా! అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్రక్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము, ప్రకృతి మరియు నిర్వికారపురుషుల తత్త్వములను గూర్చి తెలిసికొనుటయే 'జ్ఞానము' అని నా అభిప్రాయము.

15. నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః । ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞః గచ్ఛస్త్యమూఢాః పదమవ్యయం తత్ ॥
(15-5)
భావము: దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రావంచిక వాంఛలనుండి పూర్తిగా మరలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైనవారును, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.

16. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః | 
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥
(16-23)
భావము: శాస్త్ర విధిని త్యజించి, యథేచ్ఛగా (విశృంఖలముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తింపదు.

17. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః । 
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ॥
(17-16)
భావము: మనఃప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి మొదలగునవి యన్నియును మానసిక తపస్సులు.

18. సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 1 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥॥
(18-66)
భావము: సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడనైన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము.

గీతాసారమిదం పుణ్యం - యః పఠేత్ సుసమాహితః ! 
విష్ణులోకమవాప్నోతి భయశోకవినాశనమ్ ||


ఇత్యష్టాదశశ్లోకీ గీతా







14. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే । సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ॥




(14-26)




భావము: అనన్య (నిర్మలమైన) భక్తియోగముద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగ పురుషుడు సచ్చిదానందమున పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow