జేసుదాసు పాడిన అయ్యప్ప పాటపై వివాదం! Controversy over Ayyappa song sung by Jesudas!
August 18, 2025
-మార్చేందుకు ట్రావెన్కోర్ బోర్డు ప్రయత్నాలు
-ఇది కుట్ర అంటున్న సంగీత దర్శకుడు దేవరాజన్ ట్రస్టు
తిరువనంతపురం. నవంబర్ 22 - 2024: హరివరాసనం విశ్వమోహనం.. హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం.. అది విమర్ధనం నిత్యనర్తనం.. హరిహరాత్మజం దేవమాశ్రయే.. ఈ పాట విన్నవారి మనసు పులకించక మానదు. అందులోనూ జేసుదాసు గంధర్వగాత్రం నుంచి ఈ పాట జాలువారుతుంటే ఆ మాధుర్యమే వేరు. విన్నవారు. తన్మయులవుతారు. భక్త జనహృదయాల్లో నిలిచిపోయిన ఈ పాటను మార్చేస్తామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అంటున్నది. కోట్లాదిమందికి నచ్చిన ఈ లాలిపాటను ఇప్పుడు మార్చడమేమిటని ఈ పాటకు సంగీతం సమకూర్చిన ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ దేవరాజన్ శిష్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 1920లో మలయాళ సంస్కృతభాషల కలగలుపుగా రచించిన ఈ పాట 1970లో స్వామి అయ్యప్ప సినిమాలో ఉన్న గీతాల్లో ఒకటి. గాయకుడు జేసుదాసు ఆలపించిన ఈ భక్తిగీతం హిట్ అయింది. తరువాతి కాలంలో అయ్యప్ప భక్తులందరి నోట పలుకుతున్నది. ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ లాలిపాట రికార్డును శబరిమలలోని అయ్యప్ప సన్నిధిలో గత 45 ఏండ్ల నుంచి స్వామివారి శయనసేవ సందర్భంగా వినిపిస్తున్నారు.
కాగా ఇటీవల ఈ పాటలో తప్పులున్నాయని, కాబట్టి దీనిని మార్చేస్తామని టీడీబీ అంటున్నది. పాట మూలప్రతిలో ఉన్న కొన్ని పదాలు.. ముఖ్యంగా ప్రతి పాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం జేసుదాసు పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన అధ్యక్షుడు టీ పద్మకుమార్ తెలిపారు. హరివరాసనం అనే పదాన్ని జేసుదాసు సరిగా ఉచ్చరించలేదని చెప్పారు. కాబట్టి విస్మరించిన పదాలను చేర్చి అదే పాటను మళ్లీ చేసుదాసుతోనే పాడించి కొత్తగా రికార్డు చేయిస్తామని ఆయన ఇటీవల పేర్కొన్నారు. అయితే ఇన్నేండ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? దీనికి వెనుక ఏదో కుట్ర ఉంది? అని దేవరాజన్ మెమోరియల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు అనుమానిస్తున్నారు. పెద్దపెద్ద సంగీతవేత్తలు, తంత్రి (శబరిమల ప్రధాన పూజారి) కుటుంబీకులు కూడా ఈ గీతంతో తప్పు ఉందని చెప్పలేదని ట్రస్టు ప్రధానకార్యదర్శి సతీశ్ రామచంద్రన్ చెప్పారు.
Tags
