వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ *మోరియా* అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదు. మరి *మోరియా* అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం…
### మోరియా అసలు కథ
15వ శతాబ్దంలో ‘మోరియా గోసావి’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు.
ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి – సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో తెలుసుకోవడానికి మోరియా వెంటనే అక్కడున్న నదికి వెళ్లాడు. నిజంగానే నదిలో వినాయకుడి విగ్రహం దొరికింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, “మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు” అంటూ ఆయనను దర్శించేందుకు తండోపతండాలుగా వచ్చారు. ఆయన పాదాలను తాకి “మోరియా” అంటూ నినదించడం మొదలుపెట్టారు. నది నుండి తీసుకొచ్చిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి గుడిని నిర్మించారు.
మోరియా గోసావి గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి, అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో ఆయన పేరు సహజంగానే భాగమైపోయింది. అందుకే నేటికీ *“గణపతి బప్పా మోరియా”* అనే నినాదం ప్రతిసారి వినిపిస్తూనే ఉంది.
భక్తవల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి అంతరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు మరాఠీ భాషలో *“గణపతి బప్పా మోరియా, పూడ్చా వరషి లౌకర్ యా”* (గణపతి బప్పా మోరియా, వచ్చే సంవత్సరంలో తొందరగా రా) అని నినదిస్తారు.
ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలోని నదిలోనే దొరికింది. దేవుడు తన కార్యాన్ని ఎప్పుడూ భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడనే దానికి మోరియా గోసావి జీవితమే నిదర్శనం.
---
