పత్ర పూజా విశేషం - pathra pooja vishesham - వినాయక చవితి
August 19, 2025
వినాయక చవితినాడు ఏకవింశతి పత్రాలతో, కుసుమాలతో పూజించాలి. మాచీపత్రం, బృహతి, బిల్వ, దూర్వ, దత్తూర, బదరి, ఉత్తరేతి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, ఉసిరిక, మరువక, సింధూర, జాజి, గండలి, జమ్మి, గుండగలగర, మద్ది, జిల్లేడు, దానమ్మ అను పత్రాలు ఏకవింశతి పత్రాలు, పున్నాగ, మందార, దానిమ్మ, పొగడ, అమృణాళ, పాటలి, ద్రోణ గన్నేరు, సంపెంగ, మామిడి, మొగలి, మాధవి, శమ్యాక, జిల్లేడు, ఎఱ్ఱకలువ, చేమంతి, మారేడు, దత్తూర, మల్లె, పారిజాత,జాది మొదలైనని ఏకవింశతి కుసుమాలు.
సూర్యుడు కన్నాసంక్రమణకాలంలో తూర్పున ఖగోళంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఆ మార్పుల ప్రభావం ఆ పత్రాలపై, కుసుమాలపైపడి మహత్తర శక్తిని మిళితం చేసుకుంటాయి.
అందుకే ఆ సమయంలో ఆ పత్రాలతో దేవుని పూజించాలి.
వినాయక నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఆ పత్రాలు ఇంటవుండటం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆ పత్రాలన్నీ ఔషధగుణము కలిగినవే. వీటన్నిటినీ పత్రి అని పిలుస్తారు. నవరాత్రులు గడిచిన తర్వాత దీనిని జాగ్రత్తగా సేకరించి గణేశుని విగ్రహంతో పాటు నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. వినాయకుని పూజించిన పత్రి పరమ పవిత్రమయినది.
Tags
