వినాయకుడు దేవుళ్ళందరికీ ఆదిదేవుడు. అందరూ ఆయన్ని శరణువేడాల్సిందే. ఆయన్ని పూజించిన తర్వాత గాని ఇతరులను పూజించ వీలులేదు.
గ్రహాలలో శనిగ్రహ ప్రభావం గురించి అందరికీ తెలిసినదే. శని ఇతరులను పట్టి పీడించే దేవుడు. అటువంటి శనిదేవుడు బాధలనుండి రక్షించమని వేడుకునేది వినాయకుడినే. శనీశ్వరుడు ఇతరబాధలనుండి తనను తాను రక్షించుకునేందుకు ధరించేది విఘ్నేశ్వర కవచమే.
వినాయకుడు బలశాలి. పరశురాముడంతటివాడిని తన తొండంతో లోకాంతరాలకు విసిరివేశాడు.
ఒక్క పరుశురాముడే కాదు దేవతలందరూ ఒక్కటై వచ్చినా వినాయకుని జయించలేరని ఆయన జన్మించిన సమయంలోనే రుజువైంది. వినాయకుడు ఎంత శక్తివంతుడో అంతశాంత స్వభావం కలవాడు. తనంత తానుగా ఎవరికీ హానిచేయడు. ఈయన జితేంద్రియుడు జ్ఞానానికి, మోక్షానికి వినాయకుడే అధిపతి.
