కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. అతని వాహనం నెమలి. దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని విఘ్నముల కధిపతి కావాలన్నారు. దానికి గణపతి, కుమారస్వాములిద్దరూ
సిద్ధమయ్యారు. దానికి సదాశివుడు మీలో ఎవ్వరైతే ముల్లోకాలలో గల పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తామన్నాడు అందుకు కుమారస్వామి నేనే అగ్రజుడు కంటే ముందుగా రాగలను ఆయన గుజ్జురూపంతో ఎక్కడకు వెళ్లగలడు అని అహంకారంతో వెళ్ళాడు.
గణపతికి ఏమి తోచక తల్లిదండ్రులను శరణువేడుకొన్నాడు. “సకృన్నారాయణేత్యుక్త్యాపు మాన్కల్పశతత్రయ గంగాది సర్వతీర్థేషు, స్నాతోభవతి పుత్రిన్" కుమారా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించిన వారికి మూడు వందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, అని మంత్రమును సదా శివుడు గజాననుడికి ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వలన కుమారస్వామి కంటె గణపతియే ముందుగా అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించినట్లుగా కుమారస్వామికి కనపడింది. కుమారస్వామి తన అహంకారానికి పశ్చాత్తాపప గజానునకు విఘ్నాధిపత్యం యిమ్మని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి తిథి రోజున విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆనాడు సర్వదేశీయులు విఘ్నేశ్వరునికి కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లతో యధాశక్తి యధాశ పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను విని, మిగిలినది తన వాహనము మూషికకు ఇచ్చి, మిగిలినవి చేతితో పట్టుకొని భుక్తాయాసంతో కైలాసానికి వెళ్లాడు.
