విఘ్నేశుని దంతం ఎందుకు విరిగింది? Why did Vignesh's tooth break?
August 04, 2025
పరశురాముడు మహా ముక్కోపి. శివభక్తుడు. ఓ సారి కైలాసం వస్తాడు. శివపార్వతులను దర్శించాలనుకుంటాడు. ద్వారం వద్ద నున్న గణపతి పరుశురాముడిని అడ్డుకుంటాడు. దాంతో ముక్కోపి అయిన పరుశురాముడు ఆగ్రహిస్తాడు. ఇద్దరికి భయంకర యుద్ధం జరుగుతుంది.
ఆ యుద్ధంలో వినాయకుడు తన తొండంతో ఎత్తి పరుశురాముడిని దూరంగా విసిరేస్తాడు. పరశురాముడు, తనకి శివుడు ప్రసాదించిన మహిమాన్వితమైన పరశువుని వినాయకుడిపై ప్రయోగిస్తాడు.
ఆ పరశువు దెబ్బవల్లే వినాయకుని దంతం విరిగిందని ఓ పురాణ ఐతిహ్యం.
Tags
