వినాయకుని వివేకం - The wisdom of Ganesha
August 04, 2025
ఓ సారి శివపార్వతులు, తమ పుత్రులైన వినాయకుడు,
కార్తికేయు(కుమారస్వామి)లలో ఎవరు తెలివైన వారో నిర్ణయించాలనుకుని, ఆ ఇద్దరినీ ప్రపంచమంతా తిరిగి రమ్మనమని చెబుతారు. ఎవరు ముందుగా వస్తారో వారిని తన గణాలకు అధిపతిగా చేస్తానని చెబుతాడు పరమేశ్వరుడు. ఇద్దరూ బయల్దేరతారు.
తన మయూరంపై ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాడు కార్తికేయుడు.
మెల్లగా వెళ్ళే తన మూషికంపై సోదరుని కంటే ముందుగా ఎలా ప్రపంచం చుట్టి రావాలా అని ఆలోచనలో పడతాడు గణపతి వెంటనే ఆయనకో ఆలోచనవస్తుంది. తక్షణం శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి “ముల్లోకాలను ఆవరించి వున్న మీ చుట్టూ తిరిగితే ప్రపంచం చుట్టూ తిరిగినట్లే” అని చెబుతాడు వినాయకుడు.
వినాయకుని తెలివైన బుద్ధికి ఎంతో ఆనందపడతారు శివపార్వతులు.
Tags
