ఓం విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ
నీల కంఠాయ మృత్యుంజయాయ
సరేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
భస్మ భూషితాంగ హరా చంద్ర శేఖరా
ఫాల నేత్ర శూలధారి సాంబ శంకరా
!! భస్మ భూషితాంగ !!
సామ గాన ప్రియకరా ఉమాశంకరాహర హర హర శివ శంభో నటన శేఖరా
సృష్టి స్థితి లయ కారక హాలా హలధరా
కైలాస వాస దేవ ప్రభో శంకరా
!! భస్మ భూషితాంగ !!
బిల్వార్చన ప్రియకరా త్రికోటేశ్వరాఢమ ఢమ ఢమ ఢమరుక ధర శివ మహేశ్వరా
గంగాధర గౌరీ వర భక్తవ శంకరా
శ్రీశైల క్షేత్ర నిలయ శివ మల్లేశ్వరా
!! భస్మ భూషితాంగ !!
