అరె వేప చెట్టుకు ఉయ్యాల - Are Vepa Chettuku Uyyala - అమ్మవారి భజన పాటల లిరిక్స్
September 18, 2025
అరె వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
హ.. ఊరు వాడ లెయ్యాలా
అమ్మ.. జోరు జోరు ఊగాల
తల్లి.. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
ఏయ్.. వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అరెరే వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
హ.. జోరు వాన లియ్యలా
తల్లి.. జోరు జోరు ఊగాల
అమ్మ.. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
తెల్ల తెల్లరంగా తొలి పొద్దు పొడవంగా
నీ గుడికే మెమోస్తమమ్మా, అమ్మ
గుడినంతా కడిగించి వేపాకు కట్టించి
ఊదు పొగలే వేస్తామమ్మా, అమ్మ
ఏయ్ తెల్ల తెల్లరంగా తొలి పొద్దు పొడవంగా
నీ గుడికే మెమోస్తమమ్మా, అమ్మ
గుడినంతా కడిగించి వేపాకు కట్టించి
ఊదు పొగలే వేస్తామమ్మా, అమ్మ
పచ్చగుండని మేము చల్లగుండని
నీ నీడలోన మా గజ్జలమ్మ
ఊరు పచ్చగుండని మేము చల్లగుండని
నీ నీడలోన మా గజ్జలమ్మ..
వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
అమ్మ.. జోరు వాన లియ్యలా
తల్లి.. జోరు జోరు ఊగాల
అమ్మ.. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
అమ్మ.. ఖైతాబాద్ మోహనన్నా నిత్యం నిన్ను కొలిచి
నీ పాదాల చెంత చేరేనమ్మా, అమ్మ
తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దివేనిచ్చి
నీ కొంగు నీడలో దాయమ్మ, అమ్మ
ఖైతాబాద్ మోహనన్నా నిత్యం నిన్ను కొలిచి
నీ పాదాల చెంత చేరేనమ్మా, అమ్మ
తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దివేనిచ్చి
నీ కొంగు నీడలో దాయమ్మ, అమ్మ
ఏయ్.. వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
అమ్మ .. జోరు వాన లియ్యలా
తల్లి.. జోరు జోరు ఊగాల
అమ్మ.. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
ఆషాడం వచ్చిందా మీ అక్కచెల్లెలకు
ఊరు వాడ బోనాలే తల్లి, తల్లి
గణము పూజలతోని గావు కేకలతోటి
ఇంట నిన్ను కొలిచే కల్పవల్లి
ఆషాడం వచ్చిందా మీ అక్కచెల్లెలకు
ఊరు వాడ బోనాలే తల్లి, తల్లి
అమ్మ గణము పూజలతోని గావు కేకలతోటి
ఇంట నిన్ను కొలిచే కల్పవల్లి
ఆదిశక్తివి నీవై ఆదుకునగా రావే
పరాశక్తివి నీవై గజ్జలమ్మ
ఆదిశక్తివి నీవై ఆదుకునగా రావే
పరాశక్తివి నీవై గజ్జలమ్మ
ఏయ్.. వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
అమ్మ .. జోరు వాన లియ్యలా
అమ్మ తల్లి.. జోరు జోరు ఊగాల
హ .. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ…
ఏయ్ నీ చల్లని గుళ్లోన పచ్చనైన చెట్టు కాడ
మొక్కి ముడుపు కడితే చాలునమ్మా, అమ్మ
కోరిందల్లా ఇచ్చి కొంగు బంగారమమ్మా
కొడుకుల బిడ్డలని ఇస్తావమ్మా
నీ చల్లని గుళ్లోన పచ్చనైన చెట్టు కాడ
మొక్కి ముడుపు కడితే చాలునమ్మా, అమ్మ
కోరిందల్లా ఇచ్చి కొంగు బంగారమమ్మా
కొడుకుల బిడ్డలని ఇస్తావమ్మా, అమ్మ
కరుణ చూపే తల్లివై కాటాక్షించే అమ్మవై
ఖైతాబాద్ లో వెలసినవే అమ్మ
కరుణ చూపే తల్లివై కాటాక్షించే అమ్మవై
ఖైతాబాద్ లో వెలసినవే అమ్మ
కరుణ చూపే తల్లివై కాటాక్షించే అమ్మవై
ఖైతాబాద్ లో వెలసినవే అమ్మ
కరుణ చూపే తల్లివై కాటాక్షించే అమ్మవై
ఖైతాబాద్ లో వెలసిన గజ్జలమ్మ..
వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
హ .. జోరు వాన లియ్యలా
అమ్మ.. జోరు జోరు ఊగాల
తల్లి .. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
వేప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల
అమ్మ గజ్జలమ్మ ఊగాల..
అరెరే జోరు జోరు ఊగాల
హ .. జోరు వాన లియ్యలా
తల్లి.. జోరు జోరు ఊగాల
అమ్మ .. జోరు వాన లియ్యలా
ఇయ్యాల.. ఇయ్యాల.. ఇయ్యాల
Tags
