02. ఆదరించిన స్వామి దయచూడవయ్యా! | Adarinchina swamy Dayachudavaiah | హనుమాన్ హారతి
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

02. ఆదరించిన స్వామి దయచూడవయ్యా! | Adarinchina swamy Dayachudavaiah | హనుమాన్ హారతి

P Madhav Kumar

ఆదరించిన స్వామి దయచూడవయ్యా! 
మంగళం మంగళం అభయాంజనేయ,
మంచాలకట్ట మహీమాంజనేయ
నీ భక్తి పుణ్యాన సీతమ్మ దొరికే,
నీ శక్తి చలువన లక్ష్మయ్య బతికే,
శ్రీరామకార్యంబు రమ్యంగా ముగిసే,
రామచంద్రుడే నీ కౌగిటన ఒదిగే,
స్వామి కార్యము సఫలంబు చేసి,
ఆదరించిన స్వామి దయచూడవయ్యా!
మంగళం మంగళం అభయాంజనేయ,
మంచాలకట్ట మహిమాంజనేయ,
అంజన్న అంజన్న అన్నంత చాలు,
అందరికి కలిగేను ఎనలేని మేలు.
ద్రవ్యమూ ధైర్యమూ దేహ ధారుడ్యము,
శౌర్యము శ్రియము అత్యంత హర్షము,
సంతాన సాఫల్య సంవృద్ధి ఫలము,
ఆశ్రితులందరికి కొంగు బంగారము,
చెడు దృష్టి అంతము,
శుభ దృష్టి ప్రాప్తము 
గ్రహ దృష్టి గృహ వృష్టి అనుకూలమంతయు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow