*వేదశాస్తా (మరియొకవిధము)*
*హరి హర శరీర జన్మా మరకతమణి క్లుప్త మేఖలా యుక్తః**విజయతు వేదశాస్తా సకలజగత్ చిత్త మోహక్నన్ మూర్తి||*
హరిహర కుమారుడు , మరకతమణులచేత పొదగబడిన మొలత్రాడు కలిగిన వాడు ,
జనులందరిచేతనూ మోహింపబడు విధముగా శరీరాకృతి కలిగినవాడు అయిన వేదశాస్తాకు
జయము జయము.
సింహారూఢ శాస్తా ధర్మవంతుడు. ధర్మమును నెలకొల్పువాడు. భక్తిమార్గము వైపు మళ్ళించువాడు.
అన్నదాన ప్రియుడు. ధర్మమార్గమున నడచువారికి ఎటువంటి కష్టముల యందున్ననూ చేదోడూగా నిలుచువాడు , ధర్మమార్గమున ప్రవర్తించు వారి కోరికలను నెరవేర్చువాడు.
*సింహారూఢ శాస్తా*
(మరియొక విధము)
*దశత్వం, ద్వకరాంభోజ ధృతపాశ కచాయుధం*
*సింహారూఢం మహాపీఠం, ధ్యాయేత్ హరి హరాత్మజం.*
పదిముఖములను , రెండుచేతులను , పాశమును , కొరడాను చేతులయందుకలిగినవాడు ,
సింహముపై అమరియుండువాడు , మహాపీఠమునందు ప్రకాశించువాడూ అయిన హరిహరసుతుని
ధ్యానించుచున్నాను.
*యోగశాస్తా (శబరిగిరి స్వరూపము)*
*కరం దక్షిణం జ్ఞాన ముక్తాభిరామం*
*వరం వామహస్తం చ జానూపరిస్తం*
*వహంతం సదాయోగ పట్టాభిరామం*
*భజే శంభు విష్నువో: సుతం భూతనాధం.*
వామహస్తమున జ్ఞానముద్రను కలిగినవాడు , మోకాలిపై ఎడమచేతిని ఆన్చి ఉంచినవాడు ,
శరీరమునంతటినీ యోగపట్టముచేత బంధించి యుంచినవాడు , శంభు విష్ణువుల సుతుడైన
, భూతనాధుని నమస్కరించుచున్నాను.
*ఈ రూపము ధర్మశాస్తా అనియూ పిలువబడును.*
*ధ్యాయేత్ చారుజటా నిబద్ధ మకుటం దివ్యాంబరం జ్ఞాన ముద్ర*
*ఉద్యత్ దక్షకరం ప్రసన్నవదనం జాను హస్తోదరం*
*మేఘ శ్యామం కోమలం సురనుతం యోగ పట్టాంచితం*
*విజ్ఞాన ప్రదం అప్రమేయసూక్ష్మం భూతనాధం విభుం*
*(శ్రీ గణపతి నంబూద్రి , మాజీ శబరిమల మేల్ శాంతి)*
అందమైన జటామకుటము కలిగినవాడు , ఉత్తమమైన మేలి వస్త్రములను ధరించినవాడు ,
కుడిచేతియందు జ్ఞానముద్ర ధరించినవాడు , చిరుదరహాసము చేయువాడు , ధ్యానమునందు
నిమగ్నుడైయున్నవాడు , మేఘశ్యామల వర్ణరూపుడు , యోగపట్టమును ధరించినవాడు , జ్ఞానమును
ప్రసాదించువాడు , అంతటా వ్యాపించుయున్నవాడు , సూక్ష్మ రూపుడు అయిన భూతనాధుని
స్మరించుచున్నాను.
*మహాశాస్తా*
*ఆ శ్యామ కోమల విశాల తనుం విచిత్ర*
*వాసో వసానం అరుణోత్పల ధామ హస్తం*
*ఉత్తుంగ రత్న మకుటం కుటిలాగ్ర కేశం*
*శాస్తారం ఇష్ట వరదం శరణం ప్రపద్యే*
*(ఆకాశభైరవి కల్పము)*
లేతనీలిరంగు వంటి అందమైన శరీరమును కలవాడు , పలువర్ణ దుస్తులను ధరించినవాడు ,
ఉతమజాతికి చెందిన కలువపూవును చేతియందు ధరించినవాడు , ఉత్తమమైన రత్నమకుటమును
ధరించినవాడు శిరస్సు నందు పైభాగమున కొప్పుగా ముడివేయబడిన అందమైన కేశములు
కలిగినవాడు , కోరిన వరములను ప్రసాదించుశాస్తాని శరణుగోరుచున్నాను.
*ఈ ధ్యానశ్లోకము , సాధారణముగా శబరిగిరి యందు మనకు కనిపించు యోగశాస్తాకి
సంబంధించినదిగా పొరబడుచున్నారు.
కానీ దైవమును శక్తి సహితునిగా కొలుచుటయే సంప్రదాయము. నిజమునకు ఈ ధ్యానశ్లోకము ద్వారా , శాస్తాని పూర్ణాపుష్కలా సమేతునిగా మనము ధ్యానించుటయే
ఉత్తమము.
*జీమూత శ్యామధామా మణిమయ విలసత్ కుండలోల్లాసి వక్రో*
*హస్తాబ్దం దక్షమాత్రోత్పల మిత్ర భుజం వామజానూ పరిస్థం*
*భిభ్రః పద్మాసనస్తః పరికలిత ధనుర్ యోగ పట్టేన జాష్టః*
*శ్రీ పూర్ణా పుష్కలాబ్యాం పురహర మురజిత్ పుత్రకః పాతుశాస్తా.*
నీలమేఘ ఛాయకలవాడు , చెవులయందు ధరించిన కుండలముల ప్రకాశము ముఖమునందు
ప్రతిఫలించువాడు , చెంగల్వ పూవును కుడిచేతి యందు ధరించినవాడు , ఎడమ మోకాలిపై ఎడమ
చేతిని ఉంచినవాడు , పద్మాసనమున కూర్చుని యుండి , యోగపట్టమును ధరించిన అందమైన శరీరమును కలవాడు , శ్రీపూర్ణా శ్రీ పుష్కలా దేవేరులతో కూడి యుండినవాడు (పురహరుడు) ,
ఈశ్వరునికి , మురారియైన శ్రీ మహావిష్ణువునకు సుతుడైన శ్రీ శాస్తా మనలను కాపాడునుగాక ,
*భీతిహరశాస్తా*
*జంబూమూలతలే సుమేరు శిఖరే మాణిక్య సింహాసనే రూఢం*
*విశ్వ విమోహనం నిరుపమం బంధూక పుష్పారుణం*
*బాణీస్వాస కదాసి పాశ పణితా భీతిః కరాంభోరు హై*
*బిభ్రాణం నతతాపహం హృదిమహాశాస్తా రామాధ్యం భజే.*
*(ఆకాశ భైరవకల్పము)*
సుమేరు పర్వత శిఖరమునందు , నేరేడు చెట్టు కింద , మాణిక్యసింహాసనము నందు , కొలువైయున్నవాడు , భక్తుల హృదయమును మోహింపచేయగల మోహనరూపమును కలవాడు. ఎవరితోనూ పోలికలేనివాడు , ఎరుపురంగుకలవాడు , బాణము , గద , పాశము , పాము ఈ నాల్గింటినీ చేతియందు ధరించినవాడు , పూజించువారి కష్టములను తొలగించువాడు అయిన మహాశాస్తాని
ముందుగా మనస్సునందు పూజించుచున్నాను.
*జంబూతరోర్ మూలే సుమేరో శృంగేమహామండప మధ్య భాగే*
*మాణిక్య వేద్యం మణిపూర్నకుంభం మణిప్రదీపోజ్వల దిగ్ముఖాయాం*
*సభాముఖాగ్రే మునిభిశ్చేంత్యై సంసేవితాయాం సహ*
*లోకపాలైః మాణిక్య సోపాన సమున్నతామగ్రౌ*
*దోదూయమానోజ్వల చామరాభ్యాం రంభోర్వ శో భ్యాయాం ఉపవీజమానం*
*అర్కాదిదేవైః పరిపూజ్యమానం మాణిక్య సింహాసన*
*మధ్య స్థం శాస్తారమాధ్యం శరణం ప్రపద్యే.*
