*స్వామి యొక్క దివ్యనామములు*
స్వామి పలురకములైన పేర్లతో పిలువబడువాడు. ఒక్కొక్క నామమునకు ఒక్కొక్క విశేషము
కలదు. జ్యోతిస్వరూపుడై , స్వయంప్రకాశకుడైనటువంటి స్వామి యొక్క కిరణములలో , ఏ ఒక్కటియైనను
భక్తుని చేరినచో అతడి జీవితము ప్రకాశవంతమగుననుటలో సందేహము లేదు. స్వామి యొక్క వైశిష్టమును తెలియజేయు నామములు లెక్కకు మించియున్ననూ , వాటిలో కొన్నింటిని తెలిసికొందుము.
స్వరూపునిగా ప్రకాశించువాడగుటచే పరాయగుప్తునిగా కొలువబడుచున్నాడు.
*ప్రత్వంచ సర్వంచ గోప్తావాన్ మానసేతు యః*
*తస్మాత్ పరాయ గుప్తాఖ్యాం కృతవాన్ తస్య పద్మ భూ*
*(భూత నాధోపాఖ్యానము)*
ప్రాణులకు నాయకుడగుటచేత శ్రీభూతనాధుడు , భూతేశుడు , భూతనాయకుడు అంటూ
పొగడబడుచున్నాడు.
*'హరేర్ హరస్యాభి తధా పుత్రత్వమితి భావితం'*
ఆర్యదాతుడు అని పొగడబడుచున్నాడు.
*యః స్వార్‌యానం చ సర్వేషాం పితా ఇవ విపాతిచ*
*తస్మాత్ ఆర్యపితా హ్యేవం తస్యాఖ్యాం కృతలాం విధిః*
*(భూత నాధోపాఖ్యానం)*
అను వెలుగును ప్రసాదించువాడగుటచే శాస్తా గురునాధునిగా పిలువబడుచున్నాడు.
*గురుమఖిలాత్ మద్రుచరం విశుద్ధతత్వం*
*(శ్రీమహాశాస్తుః స్తుత్యష్టకం)*
ఆంధ్రులు శాస్తాని గురునాధుడు , బాలగురునాధుడు , వనగురునాధుడు అంటూ పూజించుచున్నారు.
కలవాడైనందువలన శాస్తా అంటూ పిలువబడుచున్నాడు.
*శాస్తా సర్వస్య లోకస్య తస్మాత్ శాన్తి స్తోచ్యతే*
*(సుప్రభే దాగమము)*
ఈ నామమునే తేట తమిళము నందు
తెళ్ళు తమిళ్ సాత్తన్ , మాసాలీన్ అనియూ పిలవబడును.
అవతారము దాల్చు సమయమునందే
ఈశ్వరునిచేతనూ , ఇంద్రాది దేవతలచేతనూ పొగడబడుచూ ,
నమస్కరింపబడుచూ స్తుతింపబడినవాడగుటచేత ఆర్యుడు అని పిలువబడుచున్నాడు.
ఈ లోకమునకు మొట్టమొదటిగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపము.
*యోవి పైర్ గురునాధ ఉచ్చ్యత ఇలాబాలైశ్చ శాస్తేర్యతే*
*వైశ్యైరార్యా ఉదీర్యతే దధి ధరైః నాదశ్చజోకుష్యతే*
అయినాడు.
*బ్రహ్మేంద్రామర పూజ్యయోః*
*ధామ్నా దేవోత్తమ ఇతి త్వాం వంధ్యఖిలాజనాః*
అంటూ శాస్తాని శైవపురాణము పొగడుచున్నది.
గలది గావున , అతడికి ఉచితమైన వర్ణము నీలిరంగు అగును. కాబట్టి నీలిరంగు దుస్తులను
ధరించువాడు కావున నీలాంబరుడైనాడు.
*చేలం నీలం వసాన విలసత్*
*కాండ కోదండ దండ*
అన్నారు ఆదిశంకరులు.
వేదములు సైతము భగవంతుని అయ్యా అని గౌరవింపబడుటచే వేదనాయకుడైన శాస్తా
అయ్యన్ , అయ్యా అను నామమును పొందిన వాడయ్యెను.
అయ్యన్ అను నామముతో పాటు , మర్యాదపూర్వకమైన ఆరిని చేర్చుకొనబడి అయ్యనార్ అంటూ పొగడబడుచున్నాడు. ఇట్లే కేరళ దేశమునందు శాస్తాని అయ్యన్+అప్పన్ (తండ్రి)
అయ్యప్పన్ అని పిలుచుకొందురు.
*కందారం నిశి రక్షణాయ*
*కరిరాట్వాహం ధృతం క్షేమదం*
అనునట్లుగా గజవాహనుడై , రాత్రివేళలందు సైతము కాపాడుచూ మనలను రక్షించువాడు.
కారునలుపు వంటి గుర్రమును వాహనముగా కలవాడు కారి. కారి అనగా నల్లనివాడు అయిన శని అను అర్థము కూడా కలదు. అదే నిజమైనచో , శని గ్రహము యొక్క ప్రతినిధిగా విలసిల్లువాడు
శాస్తా అయినందువలన కారి అనబడుచున్నాడు.
యమధర్మరాజు స్వామి యొక్క అనుజ్ఞకు లోబడియున్న వారగుట చేత , వైవస్వతపతి అని
పిలువబడుచున్నాడు.
కలదు. జ్యోతిస్వరూపుడై , స్వయంప్రకాశకుడైనటువంటి స్వామి యొక్క కిరణములలో , ఏ ఒక్కటియైనను
భక్తుని చేరినచో అతడి జీవితము ప్రకాశవంతమగుననుటలో సందేహము లేదు. స్వామి యొక్క వైశిష్టమును తెలియజేయు నామములు లెక్కకు మించియున్ననూ , వాటిలో కొన్నింటిని తెలిసికొందుము.
*గజారూఢుడు*
గజము అనగా ఏనుగు. జంతువులయందు ప్రణవాకారమును పొందినది. ఏనుగు అగును. వేదముల కన్ననూ మొట్టమొదటిది ఓంకారము. తనను , ఒక వేదనాయకునిగా నిరూపించు నిమిత్తము , ఓంకార స్వరూపుమైన ఏనుగును తన వాహనముగా చేసికొనినవాడు శాస్తా.*పరాయగుప్తుడు*
సకల తత్వములకూ తానే ఒక నిలయమైనట్టివాడు , తత్వములన్నిటికీ అతీతుడై పరబ్రహ్మస్వరూపునిగా ప్రకాశించువాడగుటచే పరాయగుప్తునిగా కొలువబడుచున్నాడు.
*ప్రత్వంచ సర్వంచ గోప్తావాన్ మానసేతు యః*
*తస్మాత్ పరాయ గుప్తాఖ్యాం కృతవాన్ తస్య పద్మ భూ*
*(భూత నాధోపాఖ్యానము)*
*భూతనాధుడు*
అఖిలాండ కోటి చరాచర జగత్తునకు అధిపతియై , అందు నివసించు సర్వభూతములైనప్రాణులకు నాయకుడగుటచేత శ్రీభూతనాధుడు , భూతేశుడు , భూతనాయకుడు అంటూ
పొగడబడుచున్నాడు.
*హరిహరాత్మజుడు*
స్థితికారకుడైన హరికి , లయకారకుడైన హరునకు సుతునిగా జన్మించినందువలన హరి - హర సుతుడు అనియూ , హరిహరాత్మజుడు , హరిహర పుత్రుడు అని పిలువబడుచున్నాడు.*'హరేర్ హరస్యాభి తధా పుత్రత్వమితి భావితం'*
*ఆర్యదాతుడు*
లోకులకు తండ్రివలె తోడుగా నిలచి , వారిని పరిపాలించు ఔన్నత్యము కలవాడు. కాబట్టిఆర్యదాతుడు అని పొగడబడుచున్నాడు.
*యః స్వార్‌యానం చ సర్వేషాం పితా ఇవ విపాతిచ*
*తస్మాత్ ఆర్యపితా హ్యేవం తస్యాఖ్యాం కృతలాం విధిః*
*(భూత నాధోపాఖ్యానం)*
*గురునాధుడు*
గు - చీకటి - రు - తొలగించువాడు. మానవుల యొక్క అజ్ఞానమను చీకటిని పారద్రోలి. జ్ఞానముఅను వెలుగును ప్రసాదించువాడగుటచే శాస్తా గురునాధునిగా పిలువబడుచున్నాడు.
*గురుమఖిలాత్ మద్రుచరం విశుద్ధతత్వం*
*(శ్రీమహాశాస్తుః స్తుత్యష్టకం)*
ఆంధ్రులు శాస్తాని గురునాధుడు , బాలగురునాధుడు , వనగురునాధుడు అంటూ పూజించుచున్నారు.
*శాస్తా*
ముల్లోకములను పరిపాలించు మూర్తిగా దేవతలను సైతము ఆజ్ఞాపించగల శక్తిని , పరాక్రమమునుకలవాడైనందువలన శాస్తా అంటూ పిలువబడుచున్నాడు.
*శాస్తా సర్వస్య లోకస్య తస్మాత్ శాన్తి స్తోచ్యతే*
*(సుప్రభే దాగమము)*
ఈ నామమునే తేట తమిళము నందు
తెళ్ళు తమిళ్ సాత్తన్ , మాసాలీన్ అనియూ పిలవబడును.
*ఆర్యః*
ఆర్యుడు అనగా పూజనీయుడు అని అర్థము.అవతారము దాల్చు సమయమునందే
ఈశ్వరునిచేతనూ , ఇంద్రాది దేవతలచేతనూ పొగడబడుచూ ,
నమస్కరింపబడుచూ స్తుతింపబడినవాడగుటచేత ఆర్యుడు అని పిలువబడుచున్నాడు.
*ఆదినాధుడు*
లోకమునందుండు వారికి అందరికీ నాధుడు. మొట్టమొదటి నాయకుడు.ఈ లోకమునకు మొట్టమొదటిగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపము.
*యోవి పైర్ గురునాధ ఉచ్చ్యత ఇలాబాలైశ్చ శాస్తేర్యతే*
*వైశ్యైరార్యా ఉదీర్యతే దధి ధరైః నాదశ్చజోకుష్యతే*
*దేవోత్తముడు*
బ్రహ్మ మొదలగు ఇంద్రాది దేవతలచే నమస్కరింపబడు మహాదేవ నాధుడగుటచే *'దేవోత్తముడు '*అయినాడు.
*బ్రహ్మేంద్రామర పూజ్యయోః*
*ధామ్నా దేవోత్తమ ఇతి త్వాం వంధ్యఖిలాజనాః*
అంటూ శాస్తాని శైవపురాణము పొగడుచున్నది.
*నీలాంబరుడు*
*'విచిత్ర వాసోవసానం'* అంటూ పొగడబడిననూ , శాస్తా ప్రీతిగా ధరించు వస్త్రము నీలిరంగుగలది గావున , అతడికి ఉచితమైన వర్ణము నీలిరంగు అగును. కాబట్టి నీలిరంగు దుస్తులను
ధరించువాడు కావున నీలాంబరుడైనాడు.
*చేలం నీలం వసాన విలసత్*
*కాండ కోదండ దండ*
అన్నారు ఆదిశంకరులు.
*అయ్యన్ః (అయ్యా)*
అయ్యన్ , అయ్యవారు , అయ్యప్ప అనునవి అన్నియూ శాస్తాని సూచించు నామములే.వేదములు సైతము భగవంతుని అయ్యా అని గౌరవింపబడుటచే వేదనాయకుడైన శాస్తా
అయ్యన్ , అయ్యా అను నామమును పొందిన వాడయ్యెను.
అయ్యన్ అను నామముతో పాటు , మర్యాదపూర్వకమైన ఆరిని చేర్చుకొనబడి అయ్యనార్ అంటూ పొగడబడుచున్నాడు. ఇట్లే కేరళ దేశమునందు శాస్తాని అయ్యన్+అప్పన్ (తండ్రి)
అయ్యప్పన్ అని పిలుచుకొందురు.
*గ్రామపాలకుడు*
కావలి దైవముగా నిలచి , ఒక్కొక్క ఊరినీ కాపాడి రక్షించువాడు కాబట్టి గ్రామపాలకుడైనాడు.*కందారం నిశి రక్షణాయ*
*కరిరాట్వాహం ధృతం క్షేమదం*
అనునట్లుగా గజవాహనుడై , రాత్రివేళలందు సైతము కాపాడుచూ మనలను రక్షించువాడు.
*కారి (అశ్వారూఢుడు).*
అశ్వమును వాహనముగా కలవాడు.కారునలుపు వంటి గుర్రమును వాహనముగా కలవాడు కారి. కారి అనగా నల్లనివాడు అయిన శని అను అర్థము కూడా కలదు. అదే నిజమైనచో , శని గ్రహము యొక్క ప్రతినిధిగా విలసిల్లువాడు
శాస్తా అయినందువలన కారి అనబడుచున్నాడు.
*వైవస్వతపతి*
సూర్యవంశమైన వైవస్వత కులమునకు పతియైనవాడు. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు ,యమధర్మరాజు స్వామి యొక్క అనుజ్ఞకు లోబడియున్న వారగుట చేత , వైవస్వతపతి అని
పిలువబడుచున్నాడు.