అభీష్టవరదమూర్తి
ఒకప్పుడు ఉత్తర భారత దేశమునందు *'రుత్వాకుడు'* అను మహారాజు పరిపాలించుచుండెను.
బలపరాక్రమములతో పాటుగా , జ్ఞాన సంపదను కూడా మెండుగా కలిగి , ధర్మనిరతితో పరిపాలన
చేయుచుండెను. దైవభక్తి కూడా కలిగియుండి , ప్రజలను ఎంతో ప్రేమించుచూ పాలించుచుండెను.
కాలక్రమమున రుత్వాకునికి సర్వలక్షణ సంపన్నుడైన ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు రేవతి నక్షత్రము ఆఖరి పాదమునందు జన్మించిన వాడై యుండెను. తన వంశోద్దారకుడైన
కుమారుని గారాబముగా పెంచుకొనసాగెను. తండ్రి చేయు ధర్మమును , తన వంతు కొనసాగించువాడే
తనయుడు. కానీ రుత్వాకుని కుమారుడు అందుకు భిన్నమైనవాడు.
అణుకువ అనునది ఇనుమంతయూ లేక , అహంకార పూరితుడై , ధర్మచింతన అనునది లేక , మొండి ధైర్యము కలవాడై, సదా పాప కార్యములు చేయుట యందు ఇచ్చ కలిగిన వాడై యుండెను.
వంశమును ఉద్దరించువాడు తన కుమారుడు అని భావించిన మహారాజు , అధర్మమార్గమున
పయనించుట చూచి మిక్కిలి వ్యధచెందెను. తరుణోపాయము తెలిసికొనగోరి. తన గురువైన గర్గ మహాముని ఆశ్రమమును చేరెను. గురువులకు నమస్కరించిన మహారాజు , తన కుమారుడు చెడు మార్గమున పోవుచున్న విధమును , అతడని సరిదిద్దగల ఉపాయమును సెలవిమ్మని ప్రార్థించెను.
కొంతసేపు ఆలోచించిన పిమ్మట గర్గ మహాముని మహారాజతో *“నీ కుమారుడు ఇట్లు అగుటకు కారణము అతడు రేవతి నక్షత్రము నాలుగవ పాదమున జన్మించుటయే అని తేల్చెను. విధిని మార్చుట ఎవరి తరమూ కాదనెను.*
ఇది విన్న రుత్యాకుడు కోపము పూనిన వాడై *“నా కుమారుడు గతితప్పి నడచుటకు కారణమైన రేవతీ నక్షత్రము ఆకాశమార్గము వదలి భూమిపై పడిపోవుగాక “* అని శపించెను. ధర్మనిరతి కలిగిన
వాడగుటచే రాజు యొక్క వాక్కు ఫలించి , రేవతీ నక్షత్రము భూమిపై ఒక పర్వతముపై పడి ఒక
మడుగుగా మారిపోయినది.
రేవతీ నక్షత్రము పడిన పర్వతము , రైవత పర్వతముగా ప్రసిద్ధి చెందినది. కొంత కాలమునకు , నక్షత్రము పడిన చోట ఒక అందమైన బాలిక ఉద్భవించినది. మహాశాస్తా భక్తుడైన *'ప్రముశి'* అను మునివర్యుడు ఆ బాలికను చూచి , తన ఆశ్రమమునకు గొనిపోయి , *'రేవతి'* అను నామమునిడి , తన
స్వంత బిడ్డవలె పెంచుకొనసాగెను.
మునివర్యుని ఆశ్రమమున పెరుగుచున్న రేవతి , తండ్రి వలెనే శ్రీమహాశాస్తా యందు అచంచలమైన
భక్తి కలిగినదై యుండెను. సౌందర్యవతి అయిన తన కుమారైయుక్త వయస్సు వచ్చినంతనే ఎందరెందరో రాజకుమారులను , ముని కుమారులను చూచెను.
కానీ అతడికి నచ్చకపోయెను. అగ్ని
దేవుడు ఒకమారు అతడి ఆశ్రమమునకు విజయము చేయగా , తన ఆరాటమును అతడికి తెలిపెను.
*ఓ మునిపుంగవా ! మీ కుమార్తెకు తగిన వరుడు ఉత్తర భారతమునేలు దుర్గమరాజుమాత్రమే. స్వాయంభువ మనుపు యొక్క కుమారుడైన అతడు వీరము , ధీరము , జ్ఞానము లందు ఎవరికీ సాటిలేనివాడు. అంతేగాక మహాశాస్తా యందు అమితమైన భక్తి ప్రపత్తులు కలిగినవాడు. అతడికి నీ కుమార్తె నిచ్చి వివాహము చేయుము”* అనెను.
ఇంతలో ఒకనాడు , ఎదురు చూడని విధముగా వేట కొరకై బయలు దేరిన దుర్గమ రాజు *ప్రముశి* యొక్క ఆశ్రమమును చేరి , వాకిట నిలచిన రేవతిని చూచి *“బాల ! మునివర్యులు ఎక్కడ ? “అని ప్రశ్నించుచుండెను. అదే సమయమున , రాజు యొక్క మాటలు వినుచూ బయటికి వచ్చిన మునివర్యుడు తన శిష్యులతో మహారాజునకు తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించెను. చివరగా అతడు మహారాజు మాత్రమే కాదు. కాబోవు అల్లుడు”* అను మాటలు అలవోకగా రాజు చెవుల పడెను.
గౌరవ మర్యాదలు జరిపిన అనంతరము , అగ్నిభగవానుడు సూచించిన విధముగా తన కుమార్తెను గైకొనుమని మహారాజుని ప్రార్థించెను. అప్పటికే రేవతి యొక్క సౌందర్యమునకు బానిస
అయిన మహారాజు ఆమె జనన వృత్తాంతమునూ , ఆమెకు స్వామి యందుగల భక్తి భావమును తెలిసికొని , ఆనందముగా ఆమెను స్వీకరింప నిశ్చయించెను. ఎంతో ఆనందించిన మునివర్యుడు వారి వివాహమునకు ఏర్పాట్లు గావించుచుండెను.
అప్పుడు రేవతి తన తండ్రితో *"తండ్రీ ! నావివాహము నేను జన్మించిన రేవతి నక్షత్రము నాడు చేయుమని”* కోరుకొనెను.
రుత్వాకుని శాపంకారణముగా ఆ నక్షత్రమునకు ఆకాశమున స్థానము లేకపోవుటను మనివర్యులు వివరించెను.
అందులకు రేవతి అంగీకరించనిదై *“మానవుల యొక్క పూర్వజన్మ సుకృతము ననుసరించి జరుగబోవునది తెలియచేయునదే వారు జన్మించిన సమయమున గల నక్షత్ర కూటమి *"అంతేకానీ తన కుమారుని దుష్ప్రవర్తనకు కారణము రేవతి నక్షత్రము అనుట ఉచితము కాదు. స్వామియొక్క అనుగ్రము ఉన్నచో , ఆ నక్షత్రము ఎప్పటివలే తన స్థానమున జ్వలించుచుండును”* అని తెలిపెను.
ఆమె మాటలలోని అంతరార్ధమును గ్రహించిన ప్రముశిముని. తన కుమార్తె లభించిన రైవత పర్వతమునందే తపస్సు చేయసాగెను.