చెంగల్వ పువ్వు మహిమ*
పూర్వమొక పర్యాయము , ఒకానొక రాక్షసుడికి , రాజుకు మధ్య ఘోరమైన యుద్ధము జరిగెను.యుద్ధ సమయమున రాక్షసుడొక కీటకముగా మారి రాజును తరుమగొట్టుటకు పూనుకొనెను. రాజు
కీటకము యొక్క ధాటికి తట్టుకొనజాలక పరుగులు దీసెను. అడవిలో మార్గమధ్యమున అతడు , శాస్తా ధ్యానమునందు నిమగ్నుడైయున్న ఒక ముని మీద పడెను. అతడు ఆగ్రహించి వారిరువురిని
కీటకముగాను , గజముగాను జన్మించుమని శపించెను.
శాపవశమున గజరూపమును పొందినరాజు ఆ వనములోనే తిరుగాడుచుండెను. ఒకనాడు , ఏనుగు వికసించియున్న ఎఱ్ఱకలువలతో శోభాయమానముగా ఉన్న ఒక కొలనులో మునిగి
స్నానము చేయుటకు మొదలిడెను. దాని యొక్క విజృంభణము వలన , ఆ కొలనులోని నీరు అంతయు బురదగా మారి , చెంగలువలన్నియు చెల్లా చెదరైపోయినవి. ఏనుగు , ఆ ఊబిలో నుండి పైకి
రావలయునని ఎంతగా ప్రయత్నము గావించిననూ , అది నిష్ఫలమయ్యెను.
*ఆ తరుణమునందు ఒక కీటకము అచ్చటికి వచ్చి చేరెను. తన పూర్వవిరోధి పడుచున్న దురవస్థను కన్నులారా గాంచెను. ప్రాణములను కాపాడుకొనుటకై గజముపడు తాపత్రయము”*
కీటకమునకు సంతోషదాయకమయ్యెను. తన శత్రువును మరింతయు నొప్పింపదలచెను. దాని
తొండము మీద వ్రాలి , పలువిధములుగా దానిని బాధింపదొడగెను.
ఊబిలోనుండి వెలువడజాలక పోవుట కంటెను , కీటకము వలన కలుగు బాధ రెట్టింపుగా
తోచెను. గజము తాళజాలక , కర్తవ్యము గోచరించక , కొలనులో చిందరవందరగా పడియున్న చెంగలువలను కాడలతో సహా తన తొండముతో పెరికి గాలిలో పడునట్లుగా వేగముగా పైకి విసరగొట్టెను. అట్లు ఎగురగొట్టబడిన ఎఱ్ఱకలువలు కొలను గట్టును దాటి శాస్తా విగ్రహము పైన బడినవి.
గజము చాలాసేపు వంచన నెరుగక తన శక్తి మేరకు పోరాడెను. కానీ క్రమముగా , దానిబలము
పూర్తిగా నశించిపోయెను. ఏర్పడిన ఊబిలో కూరుకొని పోయి ప్రాణములను కోల్పోయెను. దానితోపాటు , తొండములో చిక్కుకొని యున్న కీటకము కూడా అసువులు బాసెను.
ఆసమయమున , గజప్రమేయము లేకున్నను , దానిచేత విసరివేయబడిన చెంగలువలు అట్లు అగుటకు ప్రధానకారణమైన కీటక విషయమును తన మీద పడిన కారణమును , గ్రహించి , శాస్తా దేవసేనలను అచటికి పంపించెను. వారచటి కేతెంచి గజమును , కీటకమును ఒక సుందరమైన దేవవిమానముపై
అమరజేసి శాస్తా దివ్యపాదముల చెంత చేర్చిరి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
