రాక్షసిని అణగద్రోక్కిన స్వామి
మహిషి యొక్క బలపరాక్రమములను కన్నులారాగాంచిన దేవతలు నిస్సహాయులై ఆమెతో ఎదుర్కొని పోరాడిన యెడల తమకు అపజయము తథ్యమనియు , అవమాన హేతువనియు
భావించిరి. తమ ప్రాణములనైనను దక్కించుకొనిన చాలునని భావించి , రహస్య స్థలములకేగి తల
దాచుకొనియుండిరి. ఇటువంటి దీనావస్థ తమకు ఏర్పడినదికదా అని పరితపించుచున్న దేవతల మనస్సును సమాధాన పరచువిధముగా కులగురువైన బృహస్పతి అమరులారా ! కలతపడవలదు.
త్రిమూర్తులకైనను జయింపశక్యము కాని మహిషి వలన మీకు కలిగిన హైన్యమును పారద్రోల వలయుననిన , అది మహిమాన్వితుడైన హరిహరపుత్రుడు ఒక్కడి వలననే సాధ్యమగును అతడిని శరణుకోరుకొనుము అని వారికి దారిచూపెను.
దేవతలు ఆతురతతో పరుగులు దీయుచు అత్యంత శీఘ్రముగా స్వామియొక్క దివ్యసన్నిధిని
చేరుకొనిరి. ఆయన సువర్ణ సింహాసనాధీష్ఠుడై తేజో విరాజితుడై యుండెను. కరుణా సామ్రాజ్యాధిపతి యగు స్వామి యెదుట అంజలి ఘటించినవారై , ఆయనకు తమ కష్టనష్టములను గూర్చి తెలిపి మొఱలిడిరి.
దయాసముద్రుడైన శాస్తా *'మీ ప్రార్థనల వలన నాకు అపరిమితమైన ఆనందము కలిగెను. మహాపరాక్రమవంతురాలైన ఆ రక్కసి నుండి మీ ప్రాణములను కాపాడుట నావిద్యుక్త ధర్మము. మీరందరు స్వర్గలోకమునకు మరలి వెళ్లుదురుగాక అని ఆదేశించి , తన భూతగణములను ఆయత్తపరచెను.*
వరపురుడు , కటుశబ్దుడు , వీరభద్రుడు , కూపనేత్రుడు , ఘంటాకర్ణుడు ,
మహాబలి ఇత్యాదిగాగల
సేననాయకులందరూ పరివేష్ఠితులై వచ్చుచుండగా , శాస్తా ఆయుధహస్తుడై , రథమును అధిరోహించి ,
యుద్ధమునకు సంసిద్ధమయ్యెను.
భూతపరివార సహితుడై , శంఖ ధ్వానమును గావించుచూ , యుద్ధమునకు ఆహ్వానించుచున్న
శాస్తాను గాంచిన మహిషి క్రోధావేశపరురాలై , తన దేహమునందుగల రోమకూపముల నుండి
సహస్రాధికసంఖ్యలో మహిష గణములను ఉద్భవింపజేసెను. కానీ , శాస్తా యొక్క జ్ఞానాస్త్రము ఒక్కటి చాలునుకదా , రాక్షసి మాయలన్నింటిని సమూలముగా విధ్వంసము గావించుటకు మహిషి తన గదను , ఖడ్గమును , ఇతర విధములైన అస్త్రశస్త్రాల నన్నిటిని సమకూర్చుకొని స్వామిని యెదిరించి
పోరాడెను. కానీ , ఆమెకు అన్నిటిలోనూ ఓటమియే కలిగెను. అయినప్పటికిని , వెనుకంజవేయక , మహిషి తన శక్తినంతటిని కూడదీసుకొని , స్వామిని మల్లయుద్ధమునకు ఆహ్వానించెను. తగినతరుణము ఆసన్నమైనదని తెలిసికొని , శాస్తా మహిషిని వధించవలెనని తీర్మానించుకొనెను. ఆమె శరీరమును తన చేతులతో అవలీలగా పైకెత్తి , గాలిలో విసరునట్లుగా పడద్రోసెను. ఒక పెద్ద కొండ క్రింద పడి
విధ్వంసమైన విధమున , మహిషి దేహము నేలమీద ఒరిగిపడెను.
దత్తుడు ఒసగిన శాపము కారణముగా మహిషిగా జన్మించిన లీలావతి , అయ్యప్ప హస్తములలో
మరణమును పొందెను. కనుక , ఆమెకు శాప విమోచనము కలిగెను. దివ్య శరీరధారిణియై స్వామి యెదుట వినయపూర్వకముగా అంజలి ఘటించి నిలిచెను. పరశురాముడు , మహిషి సంహారమును గావించిన మహనీయుడైన శాస్తాను , తాను మునుపు
కోరుకొనియున్న వరమునకు అనుగుణముగా , శబరిగిరి మీద ధర్మశాస్తాగా ప్రతిష్టించి పూజించెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*