వస్తానంటివీ రావేమయ్యా నా మీద అలిగినావా... అయ్యాప్పా నా మీద అలిగినావా...
||వస్తానంటివీ రావేమయ్యా||
కిందటేడు నీ కొండ వచ్చి నీ దర్శన భాగ్యంబు నేను పొందినా... |2||
కో...నీ దర్శన భాగ్యంబు నేను పొందినా..
అలిసిపోయి ఆ అర్ధరాత్రి నీ కొండ పై నేను నిధురాపోయిన |2||కో ..కొండ పై నేను నిధురాపోయిన
తెల్లరంగా కల్లోకొచ్చి మా ఇంటికొస్తానని మాట ఇచ్చినావే...||వస్తానంటివీ రావేమయ్యా||
ఆలు పిల్లలతో మాట చెప్పిన అయ్యప్పా మన ఇంటికి వస్తాడు... అని |2||
కో.. అయ్యప్పా మన ఇంటికి వస్తాడు... అని
ఆనందముగా పూజా బెట్టుకోని బంధు మిత్రులను పిలిచుకొంటిని...|2||కో.. బంధు మిత్రులను పిలిచుకొంటిని...
నాల్గురిలో నవ్వు పాలు చేయక గా నా తండ్రి నా మాట నిలబెట్టు...||వస్తానంటివీ రావేమయ్యా||
పచ్చని అరటి పందరి వేసి పడి మెట్లకు పసుపు గంధం పూసి ||2||
కో...పడి మెట్లకు పసుపు గంధం పూసి
ఆవు నెయ్యి పంచ అమృతములనే అభిషేకకానికి సిద్ధం చేసి..|2||కో...అభిషేకకానికి సిద్ధం చేసి..
మీ అన్నాలిద్దరికి పూజా చేసి నీ రాక కోసం ఎదిరి చూస్తూన్నా||వస్తానంటివీ రావేమయ్యా||
