215. ఐదు కొండలు కాదు పజ్జెంది కొండలు | Aidu koṇḍalu kādu pajjendi koṇḍalu | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

215. ఐదు కొండలు కాదు పజ్జెంది కొండలు | Aidu koṇḍalu kādu pajjendi koṇḍalu | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
ఐదు కొండలు కాదు పజ్జెంది కొండలు
        దాటి వస్తున్ననయ్యా
నిన్ను చూడగా వస్తున్నమయ్యా
        ఒకటి కాదు నూట ఎనిమిది శరణాలు
        నోరార పలికిననయ్యా
కాస్త వినిపించుకోవేందుకయ్యా
అను:-) 
        కష్టాలు మాకేన్ని ఎదురైన
        కాలి నడకను ఆపము ఏమైన
        కళ్ళల్లో కన్నీళ్లు నిండీన
        కంటి చూపులు చిన్నగైపోతున్న
నేను అలిసిన సొలసిన తలిచిన తనువుతో
అల్లాడిపోతున్న…!
ఇరుముడి కట్టి ॥ అయ్యప్పా ॥
తలమీదపెట్టి ॥ అయ్యప్పా ॥
కొండలుఎక్కి ॥ అయ్యప్పా ॥
గుండెల మొక్కి ॥ అయ్యప్పా ॥

పొన్నంబలా మేడు కొండలో
        కోప తాపాలనే విడిచినానయ్య
గౌదమల నిండు కొండలో
        నాలో స్వార్ధమునే వోదిలినానయ్య
నాగమల కొండ దారిలో
        కపట బుద్ధిని మార్చుకున్నానయ్య
సుందరమల కొండలో
        సొంతమేదని తెలుసుకున్నానయ్య
‘ మన్నించరావేమీరో
మనిషిగా మారానురో ‘ (2)
అను:-) 
        చిట్టంబల మల కొండనే
        చిన్ని జీవితమని తెలిపేను
        దైలాదు మల కొండనే
        దైవముందని కండ్లు తెరిపించెను
ఎత్తు కొండల్లో కోనల్లో ఈ అడవి గుట్టల్లో
నిను వేడుకుంటున్న….!

శ్రీ పాదమల కొండలో
        తప్పు ఒప్పులు నేర్చుకున్నానయ్య
ఖళిగి మల కొండలో
        కల్మషాలన్నీ నే మరిచానయ్య
మాతంగ మల కొండలో
        మానవత్వము కనిపించేనయ్య
దేవర మల కొండలో
దివ్య జ్ఞానము పొందితినయ్య
‘ నీ లీల తెలిసిందిరో
నీ మాయ మరవందిరో ‘ (2)
అను:-) 
        నీ ల్కల్ మల కొండనే
        నిత్య జీవిత సత్యము తెలిపెనే
        దాలప్పారు మల కొండనే
        ధర్మ బాటలో నన్ను నడిపించనే
ఏదిఎక్కునున్నావు నా మొక్కువైనావు
మన్నించు నా దేవుడా…..!

నీలిమల ఎత్తు కొండనే
        ఎక్కుతుంటే గుండె భారమయ్యేను
కరిమల కొండను చూస్తనే
        ఒంటి నిండ సల్ల చెమటలొచ్చెను
పుత్తుశేరిమల కొండనే
        కఠిన కష్టాలు భరించ బాపెను
కాలై కట్టిమల కొండనే
ఓర్పు సహనాన్ని నాకెంతో నేర్పెను
‘ కొలిచిన కన్నీటితో
పిలిచిన శరణాలతో ‘ (2)
అను:-) 
        ఇంజ ప్పారమల కొండలో
        పంబ గంగనే పాపము తుడిచేను
        శబరిమల జ్యోతి కొండలో
        మణికంఠగా దర్శనమిచ్చేను
ఇరుముడి నియ్యాభిషేకము చేసి ధన్యుడనైపోతి…!


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow