Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

13. గురువనే గురవే స్వామి శరణమయ్యప్పా | Guruvanē guravē svāmi śaraṇamayyappā | గురుస్వామి భజన పాటల లిరిక్స్

గురువనే గురవే స్వామి శరణమయ్యప్పా 
గురు స్వామి దైవమే శరణమయ్యప్పా
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీవేనప్పా
తల్లి తండ్రి తర్లాలు స్థానము నీవేనప్పా
స్వామి అయ్యప్ప శరణమయ్యప్పా
స్వామి అయ్యప్ప శరణమయ్యప్పా

శబరిమల కొండల్లో తోడుగా ఉంటావప్పా ||2||
శరణాలను గుండెల్లో పలికించెదవోయప్పా  ||2||
సన్నిధానమును చేర్చే బాధ్యత నీదప్పా  ||2||
కన్నెస్వామినడిగడుగును కాపాడెదవోయప్పా
||గురువనె||
ఎరుమేలిలోనా ధర్మశాస్త నీవప్పా  ||2||
వనయాతర వెంటుండి నడిపిస్తావయ్యప్పా  ||2||
అలుదకొండనెక్కించి ఆడిస్తావయ్యప్పా  ||2||
కఠినమైన కరిమలను దాటిస్తావోయప్పా
||గురువనె||
పంపాలోన పాపలను కడిగిస్తావోయప్పా  ||2||
కన్నెమూల గణపతిని మొక్కిస్తావోయాప్పా  ||2||
శరణగుత్తిలో శరములు గుచ్చిస్తావయ్యప్పా  ||2||
పదునెట్టంబడి నెక్కించి జన్మధన్యం చేస్తివప్పా
||గురువనె||
📢 Follow