ఏ జన్మలోనిదయ్య మనది ఈ బంధము
మనది ఈ బంధము
ఇరుముడితో పెనవేసుకున్న అనుబంధము
స్వామి నీ అనుబంధము
ప్రతిచోట కనిపించు నీ దివ్య రూపము
నీ దివ్య రూపము
నీతోనే నాకు విడదీయలేని బంధము
విడదీయలేని బంధము
మణికంఠుని మహిమ ప్రతి మదిలో ఉన్నది చూడయ్యా
ప్రతి మనిషిలో స్వార్థం కనుమరుగవుతున్నది నీవల్ల
అనుపల్లవి:
ఏ పూజల ఫలమోనయ్యా నీ చెంత నేను ఉన్నా
ఏ నోముల ఫలమో స్వామి నిన్ను నేను చూస్తూ ఉన్నా
చరణం 1:
చిన్ననాటి నుండి నిన్ను చూస్తున్నానయ్యా
చేతులెత్తి శరణమంటూ మొక్కుకుంటినయ్యా
మా ఇంటిలోన నిత్యం పూజిస్తినయ్యా
భజనలను కీర్తనలను చేయిస్తినయ్యా
ఏ జన్మల నాది పుణ్యమో మణికంటా
మాల వేసి స్మరిస్తూ ఉన్నానయ్యా
శబరీష కొండకు చేరి అభిషేకము చేసుకున్నా
తోడు నీడ నీవంటూ అనుక్షణము తలుచుకుంటిని
నా దైవము నీవేనంటూ
నా దైవము నీవేనంటూ
చరణం 2 :
కనుమూసుకుంటే చాలు నా ముందు నీవయ్యా
నీ ముద్దు మొహము చూస్తే ఏ బాధ రాదయ్యా
ఆనంద భాష్పాలే కన్నీటి దారలుగా
నీ పాద పద్మము చేరే నిండు కుసుమాలుగా
ఏ సేవల నాది ఫలమో అయ్యప్ప
నీ స్మరణము చేసి ధరియిస్తూ ఉన్నానయ్యా
పంబా నది తీరము చేరి
పదునెట్టాంబడి మెట్ల నెక్కుతూ
నీ దర్శనమే కావాలంటూ
నెయ్యభిషేకము చేస్తూ
కన్నీటి దారలు పోస్తూ
కన్నీటి దారలు పోస్తూ
చరణం 3:
నీ గుడివాకిట నేను తపిస్తినయ్యా
నా మనసులోని బాధ వినిపిస్తినయ్యా
బాధ్యతల భారం నేను మోయకుంటినయ్యా
నీ తోడు నాకుంటే అది సాధ్యమయ్యా
పసిబాల ఓ మణికంట
నీ చరణం అది మాకు మోక్షం
నీ జ్యోతి దర్శన భాగ్యం కలిగించయ్యా కటాక్షం
తెలిసి తెలియక చేసిన మా తప్పులన్నీ మన్నించేవాడా
శరణమని వేడిన చాలు వెంట ఉండి నడిపించేవాడా
వెంట ఉండి నడిపించేవాడా
పాట విశేషాలు:
గానం: గంగాపుత్ర నర్సింగ్ రావు
గానం: గంగాపుత్ర నర్సింగ్ రావు
