87. మట్టి తీశావా – మట్టిలోన కలిశావా | Matti Teeshava | శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

87. మట్టి తీశావా – మట్టిలోన కలిశావా | Matti Teeshava | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
మట్టి తీశావా – మట్టిలోన కలిశావా
మట్టితోటి బొమ్మ చేసి – ప్రాణం పోశావా
మాయా జగతిలోన – మమతను పెంచావా
కడకు నిన్ను చేరుకోగా – దారి చూపావా

ప్రాణం ఉన్నప్పుడేమో – నాది నాది అంటావు
ప్రాణం పోయినక – పరాయి వాడివంటావు
వచ్చినప్పుడు ఏమీ లేదు – పోయేటప్పుడు ఏమీ రాదు
చేసిన పుణ్యమే నీ వెంట – వస్తుంది కడదాకా
||మట్టి తీశావా||
ఆరు అడుగుల నేల కోసము – కొట్లాటలు ఎందుకయ్యా
కడకు నీవు చేరుకునేది – కాటిలోన కాదటయ్య
శివ శివ అని స్మరియిస్తే – చింతలన్నీ తీరునయ్యా
శంభుని పాదాల చెంత – శాంతి నీకు దక్కునయ్యా
||మట్టి తీశావా||
కాయమేమో కంచు కోట – ప్రాణమేమో గాలి మూట
ఎప్పుడు ఏమౌనో తెలియని – ఇది ఒక మాయా నాటకం
సమయము ఉన్నప్పుడే – శివ నామము పఠించుకో
ముక్తిని ఇచ్చే ముక్కంటిని – మనసారా తలుచుక
||మట్టి తీశావా||


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow