45. హిందువులం మేమే బంధువులం | Hinduvulam Meme Bandhuvulam | శ్రీరామ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

45. హిందువులం మేమే బంధువులం | Hinduvulam Meme Bandhuvulam | శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
పల్లవి:-)
హిందువులం మేమే బంధువులం
అయోధ్యరాముని వారసులం
హిందువులం మేమే బంధువులం
వీరాంజనేయుని వీర భక్తులం

అను:-) ధర్మాన్ని కాపాడే దైవకులం
న్యాయంకై పోరాడే సేవకులం
భయమెరుగని భారతీయ సైనికులం…..!

॥ రామ రామ రామ రామ రామ రామ రామ
శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ॥2॥

చ:-1) జై శ్రీరాం అంటు రామ దండు గట్టినం
కాషాయం జెండెత్తి కదంతొక్కి కదిలినం
ఎర్రని కుంకుమను నుదుట బొట్టు పెట్టినం
ఎదురు పోరు ఎదొచ్చిన ఎదిరించినం
చేయి చేయి కలిపినం
తెగింపేందో చూపినం ॥2॥

అను:-) ధర్మాన్ని కాపాడే దైవకులం
న్యాయంకై పోరాడే సేవకులం
భయమెరుగని భారతీయ సైనికులం…..!

॥ రామ రామ రామ రామ రామ రామ రామ
శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ॥

చ:-2) రామ జన్మ భూమి ఒడిలో పుట్టిపెరిగినం
ప్రాణం వుండే వరకు హిందు జాతి నిప్పులం
వందేమాతరమని పిడికిలెత్తి పలికినం
వెనకడుగెయ్యని దమ్మున్న రామ బంటులం
ఆంజనేయ భక్తులం
మేము హిందు పౌరులం ॥2॥

అను:-) ధర్మాన్ని కాపాడే దైవకులం
న్యాయంకై పోరాడే సేవకులం
భయమెరుగని భారతీయ సైనికులం…..!

॥ రామ రామ రామ రామ రామ రామ రామ
శ్రీ రామ రామ రామ రామ రామ రామ ||2||

చ:-3) నర నరాన మరుగుతుంది మాలో రక్తము
రోమ రోమంలో రామ నామ మంత్రము
ఛత్రపతి శివాజీల గుండె ధైర్యము
హిందువులకు వుంది తలవొంచని రోషము
భారతీయ వీరులం
మాకు వుంది పౌరుషం ॥2॥

అను:-) ధర్మాన్ని కాపాడే దైవకులం
న్యాయంకై పోరాడే సేవకులం
భయమెరుగని భారతీయ సైనికులం…..!

॥ రామ రామ రామ రామ రామ రామ రామ
శ్రీ రామ రామ రామ రామ రామ రామ ||2||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow