నీ జ్యోతిని చూపించవా అయ్యప్ప (2)
నీ మాల వేసి నీ దీక్ష చేసి (2)
ఇరుముడి నే కట్టుకుని వచ్చిన మయా (2)
ఆదరించవా మా దీన బాంధవ (2)
మా దీక్షను స్వీకరించవా ఓ అయ్యప్ప (2)
నా స్వామి నీవని నిన్నే నేను నమ్మితి (2)
వనయాత్ర నే మేము చేసినామయ్యా (2)
అడివి యందు మాకు తోడు రావా (2)
కరిమలని ఎక్కించువా ఓ అయ్యప్ప (2)
స్వామియే శరణం అయ్యప్ప అంటూ (2)
శబరిగిరికి మేమేమో చేరినామయ్యా (2)
సన్నిధానంలో నీ దివ్య దర్శనం (2)
మా జన్మ ధన్యవాదారో ఓ అయ్యప్ప (2)
