11. కంకణధారణ విధి | Kankana Vidhi | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

11. కంకణధారణ విధి | Kankana Vidhi | Veerashaiva Purohitam

Madhav
రెండు మూడు కొమ్ములుండిన, భిన్నముగాని పసుపుకొమ్మును దీసికొని కలశమునకు జుట్టిన దారముతో కంకణమును సిద్ధగించి పూజించి

మంత్రము :- 
"వివాహకర్మ కర్తుమాదౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కౌతుక బంధనం కరిష్యామి ॥"

మంత్రము :- 
సర్యకాలే మహానాథ, భక్తిరస్తు క్రతోమమ । 
తస్మాద్బద్ధ్యాః కంకణశ్చ, నిశ్చయం శివసాక్షితః । 
కాశీరే వసతేకన్యా, లంకాయాం వసతే వరః । 
ఆకటో వికటశ్చైవ, గురుద్బద్ధాచకంకణం ॥

ఈ మంత్రముతో వధూవరులకు కంకణమును ధరింపజేయవలెను.

వధూవరులకు బాసింగధారణ మంత్రము :- 
"శుభకే శిరఆరోహ శోభయంతి ముఖం మమ। 
ముఖగ్ంహిమమశోభయా-శూయాగ్ం సంచభగంకురు॥ 
ఇతి శుభసూచకం (ఫాలఫలకంధరయామి)"

మధుపర్కం :- 
కన్యార్థినే గృహమాగతాతాయాస్మైవరాయ కన్యాదానాంగ భూత మధుపర్కం మధుపర్కం కరిష్యే ॥ "పాద్యం, పాద్యం, పాద్యం ప్రతిగృహ్యతాం" అర్ఘ్యం, అర్ఘ్యం, అర్ఘ్యం ప్రతిగృహ్యతాం ఆచమనీయం, ఆచమనీయం ప్రతిగృహ్యతాం॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow