౨ వ.ది. గుడజీరక మంత్రము
మంత్రము :-
సత్యేనోత్తం భితా భూమిః । సూర్యేనోత్తం భితాద్యాః ॥
భూతేనా దిత్యస్తిష్ఠంతి । దివిసోమో అధి శ్రితః ॥
విధానం: ఇతి మంత్రేణ వధూవర కరయోః గుడజీరకం సంస్థాప్య, శిరసి సంప్రోక్షయేత్ ॥ ఈ మంత్రము నుచ్చరిస్తూ వధూవరుల హస్తములందు జీలకర్ర-బెల్లమును బెట్టి ఉభయుల శిరస్సుపై ఉంచవలెను.
సూచన: ఒక పాత్రలో పాదోదక మిశ్రితము చేసిన శుద్ధోదకముతో ఆయా మంత్రముల తరువాత అభిషేకించి, ఆ పిదప భస్మ, గంధ, అక్షత, పత్రి, పుష్పాదులతో పూజించాలి.