13. కన్యాదానము జేయు క్రమము | kanyadana Kramamu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

13. కన్యాదానము జేయు క్రమము | kanyadana Kramamu | Veerashaiva Purohitam

Madhav
కన్యాదానము జేయు వరుని అత్త మామ లిద్దరు గల్సి శుద్దోదకమున బిల్వదళము, గరిక, అక్షతలువేసి, కలమునుబట్టి దిగువ (క్రింది) భాగములో ఒక పాత్రను ఉంచి వరుని కుడి అరచేతిపై వధువుయొక్క రెండు చేతులను బెట్టించి అత్త మామ లుభయులద్వారా

మంత్రము :- అహం కన్యాం సంప్రదదే,

శ్లో|| 
కన్యాం కనకసంపన్నాం, సర్వాభరణభూషితాం | 
దాస్యామిశంభవేతుభ్యం, శివలోకం జిగీషయా || 
దేవభక్తృగణోర్మధ్యే, అశేషజన సమ్మతం | 
స్వపుత్రీం దీయతేదత్తం, దారాదత్తస్తు నిశ్చయం || 
మమనామ పార్శ్వేతిష్ఠతాం, మమదక్షిణ పార్శ్వేతిష్ఠతాం, ఆగతాయేవరాయ సువర్ణ పూర్వకం దక్షిణాపూర్వకం జలధారా పూర్వకం, నకుసుమ, బిల్వదళసాక్షేణ- కన్యాదానం కరిష్యే ||

ఈ సంకల్పముతో జలధారను విడువవలెను. ఇమాం కన్యాం ప్రతి గృహ్ణామి, అని వరునిచేత జెప్పించి రెండుసార్లు ధారను వదలవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow