తోడై నను నడిపించు మణికంఠ
కష్టాలే తరిమిన కన్నీరే ముంచిన
నీవే నాకు దిక్కు కదా అయ్యప్పా
చరణం 1:
మందార కుసుమర్చితాయ మహాబలాయ మహోత్సాయ
మహాపాప వినాశాయ మణికంఠాయ
కవినామదీపాయ కస్తూరి తిలకాయ
కరుణా సముద్రాయ అయ్యప్పా
చరణం 2:
జడల శంభు మోహినిలా భజన కాంతి కలవగా
శాస్త అవతరించే అవని యందు అయ్య స్వామిగా
అయ్యప్ప స్వామిగా
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణు ఘోష స్మరణ చేసి శరణు వేడగా
స్వామి అభయమిచ్చు విజయముకై
విజయలక్ష్మిగా శ్రీ విష్ణుమూర్తిగా శరణమయ్యప్ప
చరణం 3:
నీ రూపం ఆ తేజం నయనానందం
స్వామి వర్ణనాతీతం
తొలుగునంట పాపములే నిన్ను చూడగా
నీ కొండ చేరగా
మందార కుసుమర్చితాయ మహాబలాయ మహోత్సాయ
మహాపాప వినాశాయ మణికంఠాయ
చరణం 4:
కర్మ ప్రాప్తి కరుగునంట నిన్ను కొలువగా
ఇక పుణ్యఫలము కలుగునంట పూజ చేయగా
నీ పూజ చేయగా
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
చరణం 5:
ఎదలో ఎన్ని బాధలున్నా తిరిగి వెళ్ళవా
తండ్రిని తలుచుకుంటే
తనివి తీర సదా శాంతమే
తరుగు భారమే
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
చరణం 6:
కైలాసం వైకుంఠం కలగలిసిన క్షేత్రం
ఇదిగో శబరి శిఖరం
భక్తజనము ముక్తి పొందే జ్యోతి చూడగా
నీ మెట్టు తాకగా
మందార కుసుమర్చితాయ మహాబలాయ మహోత్సాయ
మహాపాప వినాశాయ మణికంఠాయ
కవినామదీపాయ కస్తూరి తిలకాయ
కరుణా సముద్రాయ అయ్యప్పా
