Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

46. రాముడంటే రాముడే శ్రీరామచంద్రుడు | Ramudante Ramude | శ్రీరామ భజన పాటల లిరిక్స్

రాముడంటే రాముడే శ్రీరామచంద్రుడు
రాముడంటే రాముడే శ్రీరామచంద్రుడు
రారాజుగా నిలిచినాడే శ్రీరామచంద్రుడు
రారాజుగా నిలిచినాడే శ్రీరామచంద్రుడు

ధర్మాన్ని కాపాడే శ్రీరామచంద్రుడు
దాసులకు దాసుడే శ్రీరామచంద్రుడు
రామ నామమే పలికితే రావులే బాధలు
జై శ్రీరామ జై శ్రీరామ జై బోలో జై బోలో

చక్క చక్కనివాడే శ్రీరామచంద్రుడు
నల్ల నల్లనివాడే శ్రీరామచంద్రుడు
అందాల చంద్రుడే శ్రీరామచంద్రుడు
అరవింద నేత్రుడే శ్రీరామచంద్రుడు
కౌసల్య రాముడంట కారుణ్య రూపుడంట
జై శ్రీరామ జై శ్రీరామ జై బోలో జై బోలో

తాటకిని కూల్చినాడే శ్రీరామచంద్రుడు
తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు
అడవికి బయలుదేరెను శ్రీరామచంద్రుడు
ఆదర్శ రాముడు శ్రీరామచంద్రుడు
అయోధ్య రాముడు ఆదరించే దేవుడు
జై శ్రీరామ జై శ్రీరామ జై బోలో జై బోలో

ఏకపత్నీ వ్రతుడు శ్రీరామచంద్రుడు
లోకాలను ఏలేటోడు శ్రీరామచంద్రుడు
ధర్మరక్ష పాలకుడు శ్రీరామచంద్రుడు
రావణుని సంహరించే శ్రీరామచంద్రుడు
హనుమయ్య భక్తికి మెచ్చి యదలోన కొలువైనాడు
జై శ్రీరామ జై శ్రీరామ జై బోలో జై బోలో

శివధనుస్సు విరిచినాడు శ్రీరామచంద్రుడు
సీతమ్మ మనసు గెలిచిన శ్రీరామచంద్రుడు
లోక కళ్యాణముకై శ్రీరామచంద్రుడు
సీతమ్మను మనువాడే శ్రీరామచంద్రుడు
సీతా సమేత రామ సకల గుణాభిరామ
జై శ్రీరామ జై శ్రీరామ జై బోలో జై బోలో

రాముడంటే రాముడే శ్రీరామచంద్రుడు
రారాజుగా నిలిచినాడే శ్రీరామచంద్రుడు
📢 Follow