Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

10. లక్ష్మీ వరదా రావా (చీర్యాల నరసింహ స్వామి సాంగ్) | Lakshmi Varada Raava (Cheeryala Narasimha Swamy Song) Lyrics

లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా
చీర్యాల వాసా రావా చింతలు తీర్చే నినువేడ 
చీర్యాల నరసింహరావా చింతలు తీర్చే నినువేగా

నుదుటన తెల్లని నామం ఇరువైపుల శంఖ చక్రం
కొలిచిన వారికి స్వామి నీదే కొంగు బంగారం
మా లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా

చుట్టూ చూడు పచ్చదనం ఆకాశమే నీకు గోపురం
చూసిన చాలు నీ రూపం కలుగును మాకెంతో భాగ్యం
లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా

విడిచినావా వైకుంఠం చేరినావా ఈ క్షేత్రం
వైకుంఠమైనా విడిచివు గానీ భక్తుల విడిచి ఉండవు
మా లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా

శ్రీ లక్ష్మీదేవితో నీవు సిరులు చిందేలా వెలిసావు
నిను కొలవంగా మాకు సిరి సంపద కురిపించావు
లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా
చీర్యాల నరసింహరావా చింతలు తీర్చే నినువేగా
📢 Follow