ఏ నక్షత్రమునందు రోగముత్పన్నమగునో ఆ నక్షత్రము యొక్క శాంతి నాచరించు దినమున ప్రాతఃకాలమున లేచి నిత్య విధి నాచరించి, మంగళస్నానము నాచరించి, శివార్చనను తీర్చుకొని దేశకాలాదుల నుచ్చరించి,
మంత్రము :-
"మమోత్పన్నముకవ్యాధేర్జీవచ్ఛరీరావిరోధేన సమూల నాశార్థమముక నక్షత్రదేవతాభ్యాం జంపకరిష్యే" అని యుచ్చరించి (సంకల్పించి) (1008) వెయ్యిన్నూటాయెనిమిది అథవానూట యెనిమిది (108) సార్లు తత్తద్దేవతకు సంబంధించిన మంత్రమును జపించి అథవా మాహేశ్వరులతో జేయించి, శాంతి నాచరించవలెను. అది యెట్లనగా, దేశకాలాదులను ఉచ్చరించి
మంత్రము :-
మంత్రము :-
"మమోత్పన్న వ్యాధిర్జీవచ్ఛరీరా విరోధేనసమూల నాశార్థమముక నక్షత్రశాంతిం కరిష్యే"
అని సంకల్పించి గణపతి పూజాది ఆచార్య వరణాంతకర్మములను గావించి ఆచార్యుని పూజించవలెను. తరువాత ఆచార్యుడు పరిశుద్ధమైన స్థలములో బియ్యమును చతురస్రాకారముగా పరచి అచట యథావిధిగా కలశమును స్థాపించి, జలముతో నింపి, గంధము, సకలౌషధములను, గరిక, మామిడిచిగుళ్లు ఐదువిధములైన వృక్షములయొక్క బెరడు (చెక్క) సప్త విధములైన మృత్తికా (మట్టి) పంచ రత్నములు, పంచగవ్యములు, సువర్ణము మొదలగు వాటిని ఆయా యా మంత్రములతో వేసి రెండు క్రొత్త వస్త్రములను గప్పి, సకల తీర్థములను ఆ కలశమునందు ఆవాహించి పూజించవలెను. పిదప నా కలశముపైన ధాతుమయ పాత్రనుంచి, అందులో సువర్ణ నిర్మితమైన (శాంతి నాచరించి) నక్షత్రదేవతయొక్క ప్రతిమను నిల్పి నక్షత్రదేవతయొక్క నామమంత్రముతో షోడశోపచారములతో పూజించాలి. తరువాత స్థండిలమును సిద్ధపరచి అగ్నిని పూజించి, ప్రతిష్ఠాపన యొనర్చి, సూర్యాది నవగ్రహముల నర్చించి, ఆజ్యభాగాంతమున హోమమును జేసి, గరిక, నువ్వులు, పాలు, నెయ్యి వీటితో పైన చెప్పిన నక్షత్ర దేవతా మంత్రముతో నూటాయెనిమిది (108) ఆహుతి నొసంగి (విశేషముగా రోగగ్రస్తుడైనయెడల వేయి నూటాయెనిమిది (1008) సార్లు ఆహుతి నొసంగి) గాయత్రీ మంత్రముతో నూటాయెనిమిది (108) సార్లు హోమము నాచరించవలెను.
ఇట్లాచరించి, హోమమును సమాప్తి జేసి, పెరుగున్నమును బలిదాన మొసంగి, శాంతి కలశోదకముచేత యజమానున కభిషేకమును జేయించవలెను. రోగి తన చేతితో ఆచార్యునకు గోవును, ప్రతిమను దాన మొసంగవలెను. మరియు నెయ్యిలో ముఖమును జూచి, అట్టి నెయ్యిని మహేశ్వరులకు దానమొసంగి శక్త్యానుసారముగా గణారాధన నాచరించవలెను. మాహేశ్వరులు శాంతి పాఠమును పఠించి, ఆశీర్వాద మంత్రములతో నాశీర్వదించవలెను. అప్పుడు సమస్తము శాంతించును. (ఇవి సర్వనక్షత్రశాంతి)