ఎవరి జన్మరాశి జన్మనక్షత్రములో గ్రహణమగునో వారికి విశేషమైన అనిష్ట ప్రదమైనది కనుకనే అట్టి వారు శాంతినిగాని, బింబదానమునుగాని, అవశ్యముగా నాచరించవలెను. అది యెట్టులనిన
చంద్రగ్రహణము ఉన్నప్పుడు వెండి చంద్రుని ప్రతిమను చేయించి సూర్యగ్రహణమున్నప్పుడు బంగారముతో సూర్య ప్రతిబింబ ప్రతిమను మరియు బంగారముతో రెండు సర్ప ప్రతిమలను చేయించి, నెయ్యినింపిన రాగి పాత్రలోగాని, లేదా కంచు పాత్రలోగాని (నువ్వులు, వస్త్రము, దక్షిణ, సహితముగా) ఉంచి దేశకాలాదులను జెప్పి
మంత్రము :-
"మమజన్మరాశి జన్మ నక్షత్ర స్థితాముక గ్రహణ సూచి సర్వానిష్ట ప్రశాంతి పూర్వకం । ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచి తవచ్ఛుభఫలావాప్తయే బింబదానం కరిష్యే"
అని సంకల్పించి, సూర్య - చంద్ర - రాహు - గ్రహములను పూజించి (పూజా విధానమందుక్తమైన విధముగా) ధ్యానించి, నమస్కరించి
మంత్రము :-
అని సంకల్పించి, సూర్య - చంద్ర - రాహు - గ్రహములను పూజించి (పూజా విధానమందుక్తమైన విధముగా) ధ్యానించి, నమస్కరించి
మంత్రము :-
"ఓం తమోమయ మహాభీమసోమ సూర్య విమర్దన । హేమతార ప్రదానేనమమశాంతి ప్రదోభవ ॥౧॥ విధుంతుదనమస్తుభ్యం సింహికానందనాచ్యుత । దానేనానేన నాగస్య రక్షమాం వేధజాడ్య యాత్ ॥౨॥" అని మంత్రము నుచ్చరించి
మంత్రము :-
మంత్రము :-
మమజన్మరాశి జన్మ నక్షత్ర చతుర్థాద్యనిష్ట స్థానస్థితాముక గ్రహణసూచిత సర్వానిష్ట ప్రశాంతిపూర్వకం । ఏకాదశ స్థానస్థిత వచ్చుభఫలావాప్తయే ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌవర్ణం సూర్యబింబం (రాజితం చంద్రబింబం) ఘృతపూర్ణ కాంస్య పాత్ర సహితం యథాశక్తి తిలవస్త్ర దక్షిణ సహితమముక గోత్రాయాముక శర్మణే మాహేశ్వరాయ తుభ్యమహం సంప్రదదే ॥
అని యుచ్చరించి పూజ్యులైన మాహేశ్వరునకు ఒసంగవలెను. అనంతరము శాంతి పాఠమును పఠించి రాహుగ్రస్త రవి-చంద్రుల బింబాన లోకనము జేయవలెను.
(ఇది గ్రహణశాంతి)
అని యుచ్చరించి పూజ్యులైన మాహేశ్వరునకు ఒసంగవలెను. అనంతరము శాంతి పాఠమును పఠించి రాహుగ్రస్త రవి-చంద్రుల బింబాన లోకనము జేయవలెను.
(ఇది గ్రహణశాంతి)