నీ సేవలోనే ఒక స్వర్గముంది
నీపూజలునే పుణ్యముంది
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"
రఘరామా గుణధామా రఘు వంశాంబుది సోమ అనుచూ మధిలో తలచీ ఆ లంకను దాటావు
అంగను సీతను చూచితివి
ఉంగర మామెకు ఇచ్చితివి "2"
కినుక భూని ఆ లంకాపురమును
క్షణములో కాల్సివేసితివి
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"
ప్రభు భక్తితో పలుకరించి నిజభక్తిని నిలువరించిఘణమౌ ఆ నీరధిపై పెనువారధి పేర్చితివి
సంగరమందన సౌమిత్రి క్రుంగి నేలను కూలగనే
వనరౌ మూలిక క్షణాన తెచ్చి
మేలు కొలిపిన మహనీయా
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"
ఘన నీయపు ఘణతతో- మహనీయపు మహిమతో
రామాయణ కావ్యయునే రత్నమాల చేశావూ.
మేరు శరీర మహవీరా వందిత చరితా వాయుసుతా
నిరతము నీపద యుగాలి సేవను
మరవలేనురా మహనీయా
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"