Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శ్రీ పరుష వేదీశ్వర స్వామి దేవాలయం – మీనాంబరం | Sri Parusha Vediswara Swamy Temple – Chidambaram |

P Madhav Kumar

శ్రీ పరుష వేదీశ్వర స్వామి దేవాలయం – మీనాంబరం | Midjil| Mahabubnagar Dist. | Telangana


స్థల పురాణము

1. మీనాంబరం పేరుకు కారణం
పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం నల మహారాజు యుద్ధంలో ఓడిపోయి అలసటతో శని ప్రభావం వల్ల అనేక ప్రాంతాలు తిరుగుతూ మీనాంబరం ప్రాంతానికి చేరి విశ్రాంతి తీసుకున్నాడు. దుందుభి నదిలో చేపలు పట్టి వాటిని ఒక పెద్ద రాగి పాత్రలో ఉడికించేందుకు పెట్టగా, అవి అకస్మాత్తుగా ఆకాశమంత ఎత్తుకు ఎగిరి మళ్లీ నదిలో పడుతూ సజీవంగా మారాయి.
“మీనం” అంటే చేప, “అంబరం” అంటే ఆకాశం — అందుకే ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు వచ్చింది. ఇది దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.


2. క్షేత్ర వైభవం
గంగాపురం క్షేత్రానికి చెందిన మీనాంబరం, దుందుభి నది తూర్పు తీరం మీద ఉన్న గొప్ప శైవక్షేత్రం. ఇక్కడ పరుష వేదీశ్వరాలయంలో అద్భుతమైన శివలింగం ప్రతిష్ఠించబడింది.
బాదామి చాళుక్యుల కాలం నుండి పాశుపత శైవ సంప్రదాయం ఇక్కడ విస్తరించింది. ఆలయం రాష్ట్రకూట వాస్తు శైలిలో, శిలలతో, శిలాఫలకాలతో, స్తంభాలతో నిర్మించబడింది.
ఈ లింగాన్ని రససిద్ధులు స్థాపించారని నమ్మకం. రసవాద శాస్త్రవేత్తలు స్వర్ణయోగ సాధన కోసం సమీప పర్వతాల నుండి ఔషధాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రయోగాలు చేసేవారు.


3. స్వర్ణవేదీశ్వరుడు అనే పేరు
పరుష వేదీశ్వరుని లింగాన్ని ఇనుముతో తాకితే అది బంగారంగా మారుతుందనే విశ్వాసం ఉంది. అందుకే మొదట దీనికి స్వర్ణవేదీశ్వరుడు అనే పేరు వచ్చింది.
కాలక్రమేణా అది పరుషవేదీశ్వరుడుగా మారింది.
ఇక్కడ ఒకప్పుడు రసాయనశాలలు, వేద విద్యాలయాలు కూడా ఉండేవి.


4. లింగ మహిమ
ఈ శివలింగం “బ్రహ్మసూత్ర లింగం”గా ప్రసిద్ధి — అంటే లింగంపై సన్నని గీతలు ఉంటాయి.
ఈ లింగాన్ని దర్శించడం, అభిషేకం చేయడం కోటి శివలింగాలను దర్శించిన పుణ్యంతో సమానం అని విశ్వాసం.
పూర్వ జన్మ సుకృతం ఉన్నవారికే ఈ లింగాన్ని తాకే అవకాశం లభిస్తుంది అని భావిస్తారు.


ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు (2017 నుండి

2017 సంవత్సరంలో కమిటీ ఏర్పడి చేసిన ముఖ్య అభివృద్ధి పనులు:
  1. శిఖర నిర్మాణంనంది మండపం & నంది వాహనంధ్వజస్తంభ స్థాపన
  2. కళ్యాణ మండపం
  3. విడిది గదులు
  4. పూజా స్టోర్
  5. ముఖ మండపం ముందు ఇత్తడి గ్రిల్స్ తలుపులు
  6. రథం & రథశాల
  7. గోశాల (20 గోమాతలు)
  8. పెద్ద గంట
  9. ఇనుప గ్రిల్స్
  10. హైవే మహద్వారం
  11. రోడ్డు నిర్మాణం
  12. చెట్ల చుట్టూ అరుగులు
  13. గర్భగుడిలో గ్రానైట్ టైల్స్
  14. ఇత్తడి తలుపులు
  15. గణపతి, కుమారస్వామి, గౌరీమాత, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, నాగప్రతిష్ట విగ్రహాలు
  16. ఈశాన్య భాగంలో పెద్ద ట్యాంక్ (12 మూరలు)
  17. భజన మందిరం
  18. ఆలయం చుట్టూ గ్రానైట్ మండపం
  19. ప్రహారి గోడలు
  20. శివుని విగ్రహం & పల్లకి
  21. విద్యుత్ సదుపాయం
  22. నీటి ట్యాంకులు (చిన్నది + 5 నిల్వ ట్యాంకులు)
  23. సీసీ కెమెరాలు
  24. నది ఘాట్ మెట్లు

పండుగలు & ఉత్సవాలు
ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా పల్లకి సేవ (సాయంత్రం 7 నుండి 11 వరకు – 11 సార్లు)
మహా శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం
3 రోజుల జాతర ఉత్సవాలు

సహాయం కోసం విజ్ఞప్తి
ఈ మహత్తర కార్యక్రమాలకు భక్తులు క్రింది విధంగా సహకరించవచ్చు:
ధన రూపంలో
వస్తు రూపంలో
నిర్మాణ సామగ్రి (ఇసుక, సిమెంట్, స్టీల్)
అన్నదానం

సంప్రదించవలసిన నంబర్లు
9440033991
9948775982
9542430976
9705647259

మేనేజర్: 9398328687


సర్వేజనా సుఖినోభవంతు

ఏవం శుభం భూయాత్
అందరం బాగుండాలి – అందులో మనం ఉండాలి


ఇట్లు:
పరుష వేదీశ్వర స్వామి దేవాలయ కమిటీ
మీనాంబరం, గ్రా|| కుర్వగడ్డపల్లి



Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow