35. మహా మృత్యుంజయ జపశాంతి ప్రయోగః | Maha Mrityunjaya Japa Shanti Ritual |
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

35. మహా మృత్యుంజయ జపశాంతి ప్రయోగః | Maha Mrityunjaya Japa Shanti Ritual |

P Madhav Kumar
మహా మృత్యుంజయ జపశాంతి ప్రయోగః

సమస్త కార్యములు సంకల్పము నుండే సిద్ధించును. కనుక ఇట్టి సంకల్పము ఇష్టార్ధసిద్ధి కొరకు ఎవరి పక్షమున ఎంత జపము చేయించవలెనో అద్దాని నంతను వ్యాకరణాను సారముగా సంకల్పమును శుద్ధముగా చేయవలెను. తెలియజేయుటకై ఇట నాలుగైదు సంకల్పములను వ్రాయబడినవి. ఉదా :- దేశకాలుల నుచ్చరించి “అముకగోత్రో అముక శర్మమమాత్మనః శృతి-స్మృతి పురాణతంత్రోక్త ఫలావాప్తయే మమజన్మ సం||ము, మాస, దిన, గోచరాష్టక వర్గదశాంతర్దశాదిషుయే అనిష్ట ఫల కారకాగ్రహస్తేషాం సానుకూలార్ధం సకలాధి వ్యాధి ఝటిత ప్రశమన పూర్వక దీర్ఘాయుష్య బలపుష్టి నైరుజ్యాది సకలాభిష్ట సిద్ధ్యర్థం శ్రీ మహా మృత్యుంజయ ప్రీత్యర్థం (శత సహస్రాయుత లక్షాది) సంఖ్యయా శ్రీ మహా మృత్యుంజయ మంత్రజప మహం కరిష్యే”
  1. అథవా “మాహేశ్వర ద్వారా కారయిష్యే”
  2. అథవా “విషూచికాదిజన మారోపర్గ శాంతర్యర్థం”
  3. అథవా “వృష్టికామార్థం”
  4. అథవా “అముకా భియోగ నివృత్యర్థం”
  5. “అముక దుఃఖనిరసనార్థం”
  6. “అముక దిగ్యాత్రా నిర్విఘ్నపూర్వక సిద్ధ్యర్థం”
  7. “ప్రతిసన్ముఖ శుక్రదోష దూరీకరణార్థం”
  8. “కాకమైధున దర్శనాది సూచిత సర్వారిష్ట నివృత్యర్థం”
  9. “పల్లీ పతన, సరటారోహణముకదుష్టాంగస్ఫురణ జనితాశుభఫల వినాశనార్థం”
  10. “దీర్ఘాయుషీ పుత్రప్రాప్త్యర్థం”
  11. “యధేచ్ఛధన లాభార్థం”
  12. “అముక పదప్రాప్త్యర్థం”
  13. “అముక కామనా సిద్ధ్యర్థం”
  14. “అముక సంఖ్యా పరిమిత శ్రీ మహా మృత్యుంజయ జప మహం కరిష్యే” “వా మాహేశ్వర ద్వారా కారయిష్యే” 
ఈ విధముగా తన కేది యవసరమో దానిని సందర్భోచితముగా సంకల్పమును జెప్పుకొనవలెను.

మృత్యుంజయ జపమును జేయువారు నిత్య కర్మలనారించి, జపము చేయు స్థలమును పరిశుద్ధమొనర్చి, రంగవల్యాది ముగ్గులతో నలంకరించి, కంబలము (గొంగడి) మొదలగు ఆసనము వేసి, ఆ ఆసనము పైన తూర్పు అథవా ఉత్తర ముఖముగా కూర్చుండి, ప్రాణాయామము నాచరించి,

మంత్రము :- 
“ఓం గురవే నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ఇష్ట దేవతాయై నమః” అని ప్రార్థించి, ప్రతిజ్ఞ సంకల్పమును జేసి, తదుపరి భూతశుద్ధి, ప్రాణప్రతిష్ఠా పనాదులను జేయవలయును. ఎట్టులనగా,

మంత్రము :- “మమ అముక ప్రయోగ సిద్ధ్యర్థం భూతశుద్ధి, ప్రాణప్రతిష్ఠాపపంచ కరిష్యే” తరువాత “ఓం ఆధారశక్తిః కమలాసనాయ నమః” అని ఆసనమును పూజించి,

మంత్రము :- “పృథ్వీ మంత్రస్య మేరుపృష్ఠ ఋషిః కూర్మోదేవతా సుతలంఛందః ఆసనే వినియోగః పృథ్వీత్వయాధృతాలోకాదేవీత్వం విష్ణునాధృతా । త్వంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం ॥

అను మంత్రముచేత గంధ, పుష్పాదులతో భూమిని పూజించవలెను. ఆ పిదప,

మంత్రము :- 
“పాదాది జానుపర్యంతం - పృథ్వీస్థానం తచ్చతురస్రం-పీతవర్ణం । బ్రహ్మదైవతం “వం” మితిబీజయుక్తం”

అని ధ్యానించి, పునః మంత్రము :- 
“జాన్వాదినాభి పర్యంతం ఆపస్థానంతచ్చార్ధ చంద్రాకారం శుక్లవర్ణం పద్మలాంఛితం విష్ణుదైవతం “లం” మితిబీజయుక్తం” అని ధ్యానించి, పునః

మంత్రము :- 
“నాభ్యాది కంఠపర్యంతం అగ్నిస్థానం త్రికోణాకారం రక్త వర్ణం స్వస్తి కలాంఛితం రుద్రదైవతం “రం” మితి బీజయుక్తం” అని ధ్యానించి, పునః

మంత్రము :- “కంఠాది భ్రూమధ్య పర్యంతం వాయుస్థానం, షట్కోణాకారం షడ్బిందులాంఛితం కృష్ణ వర్ణం ఈశ్వరదైవతం “యం” మితిబీజయుక్తం” అని ధ్యానించి, పునః

మంత్రము :- 
“భ్రూమధ్యాది బ్రహ్మరంధ్ర పర్యంతం ఆకాశస్థానం, వృత్తాకారం ధ్వజలాంఛితం సదాశివ దైవతం “హం” మితి బీజయుక్తం” అనియు తన శరీరమునందు పంచ మహా భూతములను ధ్యానించి ప్రవిలాపన (మిశ్రితము)ను గావించ వలయును, ఎట్టులనగా

మంత్రము :- “పృథ్వీమప్సు । ఆపోగ్నౌ । అగ్నిం వాయౌ । వాయు మాకాశే । ఆకాశంతన్మాత్రం హాంకారమహదాత్మి కాయాం మాతృకాసంజ్ఞక శబ్దబ్రహ్మస్వరూపాయాం హృల్లేఖార్ధ భూతాయాం ప్రకృతిమాయాయాం ప్రవిలాపయామి । తధా త్రివిధం మాయాంచ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావిస్యాత్మ ప్రకాశరూప సత్య జ్ఞానానంతానంద లక్ష్మణే పరమకారణే పరమార్థభూతే పరబ్రహ్మణి ప్రవిలాపయామి। తచ్చ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావి, సచ్చిదానంద స్వరూపం పరిపూర్ణం బ్రహ్మైవాహమస్మి॥ అని ధ్యానించి, తదుపరి
 మంత్రము :- 
“యథోక్త స్వరూపాత్ ప్రణవాత్మకాత్ పరబ్రహ్మణః సకాశాత్ హృల్లేఖార్ధ భూతా । సర్వమంత్రమయ్యామాతృకా సంజ్ఞకాశబ్ద బ్రహ్మాత్మికా మహదహంకారాది పంచతన్మాత్రాది సమస్త ప్రపంచ కారణభూతా ప్రకృతి రూపామాయారజ్జు సర్పవత్ వివర్త రూపేణ ప్రాదుర్భూతా ॥ అని స్మరించి

మంత్రము :- తస్యా మాయాయాః సకాశాత్ యథోక్త మాకాశముత్పన్నం ఆకాశాద్వాయురుత్పన్నః । వాయోరగ్నిః అగ్నేరాపః । అద్భ్యః పృథ్వీ సమజాయత ॥ స్మరించి

మంత్రము :- “తేభ్యః పంచమహాభూతేభ్యః సకాశాత్ స్వశరీరం తేజః పుంజాత్మకం పురుషార్ధ సాధన దేవయోగ్యముత్పన్నం”

అని స్మరించి, ఆ తరువాత

మంత్రము :- “తస్మిన్ శరీరే సర్వాత్మకం సర్వజ్ఞం సర్వశక్తి సంయుక్తం సమస్త దేవతామయం సచ్చిదానంద స్వరూపం బ్రహ్మత్వ రూపేణాను ప్రవిష్టం” అని భావించవలెను. “ఇది భూతశుద్ధి :”

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow