34. స్వస్తి పుణ్యాహవాచనము | Punyahavachanam - పుణ్యాహవాచనం |
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

34. స్వస్తి పుణ్యాహవాచనము | Punyahavachanam - పుణ్యాహవాచనం |

P Madhav Kumar

స్వస్తి పుణ్యాహవాచనము


సమ్మార్జన (అలికి) మొనర్చి రంగవల్లిలతో నలంకరింపజేసి శుద్ధ ప్రదేశములో

(‘‘మహీద్యౌః పృథ్వీచనఇమంమిమిమక్షతాం । పిపృతన్నో భరమభిః)

అని జెప్పి, తన యొక్క రెండూ చేతులతో దక్షిణోత్తరముల భూమిని స్పృశించి (ముట్టి) జపించి యాస్థానములందు (‘‘ఓషధయస్సంవదంతేసోమేన సహరాజ్ఞాయస్మైకృణోతి బ్రాహ్మణ స్తంరాజన్పారయామసి’’)

అని ఉచ్చరించి అరటి ఆకులను పరచి,

(‘‘మొనలో కాయ తనయాయధాన్యం బీజంవహద్యే అక్షితం ।
అస్మభ్యంతదత్తన యధ్య ఈమహే । రాధే విశ్వాయ సౌభగం’’)


అని యుచ్చరించి ఆ అరటియాకులపైన ఒక సేరు (బళ్ళ-అడ్డ పరిమితం) బియ్యము గట్టిన రెండు మూటలను ఉంచి,

(‘‘ఆకలశేషుధావతిశ్యేనో వర్మవిగాహతేఅభిద్రోణా కన్నిక్రదత్’’)

అని చెప్పి బియ్యపు గుంపులపైన లోహమయముగాని, లేదా మృణ్మయపు (మట్టివి) రెండు కలశములనుంచి

(‘‘ఇమంమేగంగేయమునే సరస్వతి సుతుద్రిస్తో మగ్‌ంసచతా పరుష్ణియా । అసిక్నియా మరుద్వృధే వితస్త్యార్జికీయే శృణు హ్యాసు షోమయా ॥)

అని చెప్పి తీర్థోదకముతో నింపి

(‘‘గంధద్వారం దురాధర్షాఁ నిత్య పుష్టాం కరీషిణీం । 
ఈశ్వరీగ్ం సర్వ భూతానామిహో పహ్వయే శ్రియం ॥) 

అని గంధమును ప్రోక్షించి, పైన గంధ లేపించి (పెట్టి) పుష్పమాలికలతో నలంకరింపజేసి

మంత్రము :- 

‘‘సహీరత్నానిదాశుషే-సువాతి సవితాభగః తంభాగంచి త్రమీమహే ॥

అని యుచ్చరించి పంచరత్నములను ఆ కలశములలో వైచి,

మంత్రము :- 

ప్రవోయజ్ఞేషు దేవయంతో, అర్చ్యంద్యావానగ్హోత్రభిః పృథ్వీ ఇషద్వేపాషం బ్రహ్మణ్య సమానివిప్రా విష్విగ్యంతి విని నోనశాఖాం ॥)

అని మామిడి చిగుళ్ళతో (ఆకులతో) నలంకరించి,

మంత్రము :- 
“కాండాత్కాండా త్ప్రరోహంతి పరుషః, పరుష పరి ఏవానోదూర్వే ప్రతను సహస్రేణ శతేనచ ॥

అని దర్భ (గరిక) లనుంచి

మంత్రము :- 
“హిరణ్య రూపస్స హిరణ్య సందృగపాన్నపాతేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరియోనేరిషద్యా హిరణ్యం దాదత్యం నమస్మై ॥

అని నిష్క (౯౦ తులములకు నిష్కమని పేరు) అథవా అర్థనిష్కం లేదా యధాశక్తి ననుసరించి సువర్ణమును కలశమునందుంచి

మంత్రము :- 
“పూర్ణాదర్వి పరాపత సుపూర్ణా పునరాపత । 
వస్నేవ విక్రీణావహ ఇషమూర్జగ్ం శతక్రతో । 
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః । 
బృహస్పతి ప్రసూతాస్తా నో ముంచత్వగ్ం హసః ॥

అని కలశములపై టెంకాయలనుంచి...

మంత్రము :- 
“యువాసువాసాః పరివీత అగాత్యుశ్రేయాన్ భవతి జాయమానః । 
తంధీరాస్కవయ ఉన్నయంతి, స్వాధియో మనసా దేవయంతః ॥

అని రెండు కలశములపై రెండు వస్త్రములనుంచి (చుట్టి)

మంత్రము :- 
“తంతుంతన్వన్ రజసో భాను మన్విహి । 
జ్యోతిష్మతః పథో రక్షియాన్కృతాన్ । 
అనుల్బణం వయతజోగువ మపోమనుగ్వజనయా దైవ్యం జనం”

అని తెల్లని దారముతో జుట్టి

మంత్రము :- 
తత్త్వా యామి బ్రహ్మణీ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః । అహేడమానో వరుణేహబోధ్యురు శగ్ంసమాన ఆయుః ప్రమోషీః) ఓం భూః వరుణమావాహయామి । ఓం భువః వరుణ మావాహయామి । ఓం సువః వరుణ మావాహయామి । ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి ॥

అని ఈ మంత్రముతో వరుణదేవునావాహనమొనర్చి

మంత్రము :-
 “కలశస్యముఖేరుద్రః కంఠే విష్ణుస్సమాశ్రితః । 
మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యేమాతృగణాస్స్మృతాః । 
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా । 
ఋగ్వేదోఒథ యజుర్వేదో సామవేదోహ్యథర్వణః । 
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ । 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

అని కలశమును ముట్టి జపించి (సర్వపూజా ప్రకరణమున జెప్పిన ఉపచారములతో పూజించి)

మంత్రము :- 
“అనయాపూజయా వరుణాదిదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవంతు ॥
అని ఉచ్చరించి అక్షత హిరణ్యాదులతో గూడిన జలమును వదలవలెను.

అనంతరము పవిత్ర పాణిలో ప్రాణాయామము నాచరించి నమస్కరించి (చేతులు జోడించి)

మంత్రము :- 
“ఉమా మహేశ్వరాభ్యాం నమః । ప్రథమగణేభ్యోనమః । భక్త మహేశ్వరేభ్యో నమః । దుర్గా గణపతి క్షేత్రపాలకేభ్యోనమః । మాతృభ్యోనమః । పితృభ్యోనమః । ఆచార్యేభ్యోనమః । ఇష్ట దేవతాయై నమః । సర్వేభ్యో మహేశ్వరేభ్యోనమః ॥

అని ఉచ్చరించి నమస్కరించి ఆ మీదట అట్టి కలశముల యెదుట ప్రశస్తులై, సమాధానముజెప్ప సమర్థులై, దానమును బుచ్చుకొననివారై, ఉత్తరీయమును (సెల్లను) గప్పుకొన్నవారై, పవిత్ర పాణులై, (చేతులు) గలవారై యున్న మహేశ్వరులను గూర్చుండబెట్టి-గంధ, పుష్పాదులతో వారిని బూజించి,

మంత్రము :- 
“ఆశిషః ప్రార్థయామి” అని చెప్పగా అందుకు మహేశ్వరులు “సత్యాహ్యేషా ఆశిషస్సంతు దీర్ఘా, నాగనద్యోగిరయస్త్రీణి విష్ణు పదానిచ । తేనాయుః ప్రమాణేన పుణ్యాహం దీర్ఘమాయురస్తు ” 
అని చెప్పి, మహేశ్వరులచేత ఆశీర్వాదరూపంబైన ప్రత్యుత్తరమును బడసి, పునః ప్రాణాయామము నాచరించి దేశ కాలాదులను బేర్కొని,

మంత్రము :- 
“గర్భాధానకర్మ కర్తుమాదౌ శుద్ధి వృద్ధ్యభ్యుదయసిద్ధి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శాంత్యర్థం వీర మాహేశ్వరైస్సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే ॥

సూ* ఇతర కర్మల నాచరించునప్పుడుగూడ అక్కడ ఇక్కడ జూపినట్లు గానే అన్నింటిని నెరవేర్చవలెను. సంకల్పమునందు మాత్రమే కొద్దిగా మార్పు జేయాలి. ‘‘దీక్షా కర్తుమాదౌ, అథవా, వివాహకర్మ కర్తుమాదౌ అని యే కర్మనాచరించవలెనో ఆ కర్మను సంకల్పమున పేర్కొనవలెను.

అని సంకల్పించి ఉత్తర కలశము చేత బుచ్చుకొని “ఆపః” అని ఉచ్చరించి ఉదకము నీయగా అందుకు మాహేశ్వరులు “శివా ఆపస్సంతు” అని ఉచ్చరించి స్వీకరించవలెను. మరల కర్త (యజమాని-కర్తువు) “గంధాః”, అని గంధము నొసంగ, మహేశ్వరులు “సుగంధాః పాంతుః” అని చెప్పి దాన్ని స్వీకరింతురు. కర్త :- “అక్షతాః” అని అక్షతల నొసగ వాటిని గైకొని మాహేశ్వరులు :- “అక్షతం చారిష్టంచాస్తు” అనగా కర్త :- “సుమనసః” అని పుష్పములనుీయగా వారు మాహేశ్వరులు :- “ఐశ్వర్యమస్తు” అని చెప్పగా కర్త :- దక్షిణాః పాంతు” అని దక్షిణ నొసగ, మాహేశ్వరులు “బహుదేయంచాస్తు” అని యుచ్చరించిన తరువాత కర్త ఆ కలశమును చేత నిడుకొని లేచి నిల్చి “మనస్స మాధీయతాం” అని చెప్పగా, మాహేశ్వరులు “సమాహిత మనసస్సః” అనగా, కర్త :- “ప్రసీదంతు భవతః” అని నుడువగా మాహేశ్వరులు :- “ప్రసన్నాస్సః” అని మాహేశ్వరులంద రేకకంఠముతో


మంత్రము :- 
“శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, ధర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఇష్ట సంపదస్తు ॥

అని ఈ 15 వాక్యములను పలుకగా

కర్త :- ‘‘స్వయం కర్మ దేవతాత్మకో భగవాన్ శివః ప్రీయతాం’’ అని చెప్పగా మాహేశ్వరులు

‘‘ప్రీయతాం భగవాన్ కర్మ దేవతాత్మకః’’ అనగా

కర్త :- ‘‘పుణ్యాహంవాచ ఇష్యే’’ అని చెప్పగా అందుకు మాహేశ్వరులు ‘‘వాచ్యతాం’’ అని చెప్పి పునః మాహేశ్వరు లందరు

మంత్రము :- 
‘‘ఉద్గాతేవ శకునే సామగాయసి 
బ్రహ్మపుత్ర ఇవసవనేషుశగ్ం, 
ససి బుథేనవాజీ శిశు మతీరపీత్యా । 
సర్వతోనశ్శకుమనే భద్రమావద । 
విశ్వతో నశ్శకునే పుణ్యమావద’’  
అని చెప్పవలెను. తరువాత

కర్త :- ‘‘ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు’’ అని ఉచ్చ స్వరముతో పలుకగా మాహేశ్వరులు ‘‘ఓం పుణ్యాహం’’ అందురు. పిదప ‘‘ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు’’ అని

కర్త :- ‘‘ఓం పుణ్యాహం’’ అని మాహేశ్వరులందరు మధ్యమ స్వరముతో మరియు ఉచ్చస్వరముతోను మూడు మూడు పర్యాయములు చెప్పవలెను. తదుపరి

కర్త :- ‘‘గర్భాదాన కర్మణే ఓం స్వస్తి భవంతో బ్రువంతు’’ అని ఉచ్చ రించగా మాహేశ్వరులు ‘‘గర్భాదాన కర్మణే ఓం స్వస్తి ’’ అని ఉచ్చరించవలెను. మరల

కర్త :- ‘‘గర్భాదాన కర్మణే బుద్ధిం భవంతో బ్రువంతు’’ అనగా

మాహేశ్వరులు :- “బుధ్యతాం” అని యుచ్చరించ దగును. దీనిని గూడ మూడు మూడు పర్యాయములు చెప్పాలి. తరువాత కర్త పత్నీసమేతుడై పూర్వాభిముఖుండై కూర్చుండి ఉత్తర దిక్కు కలశమును కుడి చేతితోను, దక్షిణ దిక్కు కలశమును ఎడమ చేతితో పట్టుకొని ఆ రెండింటిని గల్పి రెండుగా ధారను విచ్ఛిత్తి గాకుండా మరో పాత్రలో

మంత్రము :- 
ఓ షధానిచ రత్నాని కాలస్యావయవాశ్చయే । 
సరిత స్సాగరాశ్చైవ తాస్తీర్థానిచ హృదానదాః । 
ఏతైత్వామభిషించంతు, సర్వకామార్థ సిద్ధయే । 
శాంతిః పుష్టిస్తుష్టిశ్చాస్తు । శివగ్ం శివమస్తు । భగవాన్ శివః ప్రీయతాం ॥

ఈ మంత్రము చేత అభిషేకించవలెను. ఆ పిదప మాహేశ్వరులు ఆ జలమును మామిడి చిగురాకులతో పతి-పత్నుల శిరస్సులపై ప్రోక్షిస్తూ

మంత్రము :- 
“తత్సవితుర్వరేణ్యం విశ్వామిత్రః సవితాగాయత్రీ । ఆపోహిష్టేతి త్రిచ స్యాయంబరీషః । సింధుద్వీపాఆపో గాయత్రీ । పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్ఠేతేద్వే అనుష్టుభౌ । ఆపోహిష్ఠా మయో భువస్తా న ఊర్జే దధాతన మహేరణాయచక్షసే । యోవ శ్శివతమోరసస్తస్య భజాయతే హనః । ఉశతీరివమాతరః తస్మాఅరంగ మామవోయస్యక్షయాయజిన్వథ । ఆపోజన యథాచనః ॥

అను మంత్రముతో ప్రోక్షించవలెను. తరువాత ముత్తైదువలు మంగళారతి నొసగ, మాహేశ్వరులందరు ఆశీర్వాదము నొసగుదురు.

ఇది స్వస్తి పుణ్యాహవాచనము సమాప్తము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow